BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రోజు రోజుకు గీతూ, చంటిల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఎక్కడో చిన్న సరదాకి స్టార్ట్ అయిన ఈ వార్ నాలుగు వారాలు ముగిసినప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఎపిసోడ్ లో ఓ అంశం గురించి హౌస్ లో చాలాసేపు డిష్కషన్ జరుగుతుంది. ఈ క్రమంలో గీతూ తన బాధను చెప్పుకుని నాగార్జున ముందు బోరున ఏడ్చేస్తుంది.
ఓ రోజు హౌస్ లో కీర్తి బెడ్ రూంలో ఒంటరిగా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించి చంటి, బాలాదిత్య అన్న మాటలను గీతూ మోసుకెళ్లి కీర్తికి చెప్తుంది. దీంతో కీర్తికి చంటి, బాలాదిత్యలకు మధ్య ఏర్పడ్డ గ్యాప్ గురించి ఆదివారం ఎపిసోడ్ లో పెద్ద చర్చ కొనసాగింది. గీతూ తప్పుగా కీర్తికి కన్ వే చేసిందనేది ఇక్కడ అసలైన పాయింట్. ఈ క్రమంలో గీతూ వెర్షన్ ను వింటూ ఉంటాడు నాగార్జున.

అప్పుడు చంటి నేను ఫుడ్ చేస్తున్నానని తినడం మానేశాడు.. నాకు హౌస్ లో చాలా బాధగా ఉంది సార్ అంటూ నాగార్జునకు తన బాధను చెప్పుకుని ఏడుస్తుంది గీతూ. కానీ ఒక్క పూట మాత్రమే తినలేదని, తర్వాత తిన్నాడని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు చంటిని అంటూ సుదీప చెప్తుంది. అక్కా నీవు ప్రతి విషయంలో దూరి డామినేట్ చేయకు అంటూ మరోసారి బోరున ఏడుస్తుంది గీతూ.
దీంతో నేరుగా చంటి అభిప్రాయం తీసుకుంటాడు నాగార్జున. వెంటనే చంటి లేచి తాను కూడా అదే విషయం చెబుతాడు. చంటి మీద కోపంతో నేను అందరికీ చాడీలు చెప్తున్నాను సార్.. నాతో సరిగా ఉండటం లేదు అని గీతూ బాధ పడుతుంది. అలా ఏం లేదు… గీతూకి త్రోట్ సమస్య వస్తే ఎవరైనా మిరియాల పాలు కలిపి గీతూకి ఇవ్వండి అని నేనే చెప్పాను అంటూ చంటి తన వెర్షన్ ను చెప్పాడు. ఇలా హౌస్ లో చాలా సేపు గీతూ, చంటికి మధ్య జరిగిన గొడవల గురించి డిస్కషన్ జరుగుతుంది.