Brahmanandam : మెగాస్టార్ చిరంజీవి.. పైకి కనిపించరు కానీ చాలా చిలిపి. తాజాగా బ్రహ్మానందం చెప్పిన విషయాలు వింటే ఆయన ఎంత చిలిపివారో తెలుస్తుంది. బ్రహ్మీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా చేసేవారో చాలా సందర్భాల్లో చిరు చెప్పి నవ్వుల పూలు పూయించారు. ఇక తాజాగా చిరు గురించి చెప్పి.. ఆయన తనను ఎలా ఆడుకున్నారో చెప్పి బ్రహ్మీ కడుపుబ్బ నవ్వించారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మీ ప్రసంగించారు. ఈ సమయంలోనూ అంటే బ్రహ్మీ స్టేజ్ ఎక్కేంత వరకూ ఆయన్ను చిరంజీవి ఒక ఆడుకున్నారు.
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను బ్రహ్మీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘‘జంధ్యాల గారు చిరంజీవి గారికి నన్ను పరిచయం చేశారు. చిరంజీవిగారు ఎంతో అభిమానంగా నా బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టుకుని.. నాకు మామూలు టికెట్ ఇచ్చారు. నేను ఎయిర్‌పోర్టు ల్యాడర్ దగ్గర నిలబడి.. ఓ పిచ్చి చూపు చూస్తుంటే పక్కనే ఉన్న వాళ్లు ఏం కావాలని అడిగారు. ఇది నా టికెట్ అని చెప్పా. వాళ్లు బోర్డింగ్ పాస్ అడిగారు. దాని గురించి నాకు తెలియదు. అప్పుడు చిరు వాట్ హ్యాపెండ్ అనుకుంటూ వచ్చారు. కానీ చేసిందంతా ఈయనే.
Brahmanandam : కాళ్లకు దండం పెడితే.. మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పారు..
అప్పుడు వాళ్లు బోర్డింగ్ పాస్ లేదు పైకెలా వస్తారు అన్నారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు అని చెప్పి బోర్డింగ్ పాస్ చూపించారు. ఇక ఆ తర్వాత నేను అందరిలాగే గబ గబా ఫ్లైట్ ఎక్కుతుంటే ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు. వారికి కాళ్లకు దండం పెట్టాలి. వాళ్లు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పారు. నేను వెంటనే వెళ్లి వాళ్ల కాళ్లకు నమస్కారం పెట్టా. వాళ్లు కంగారు పడిపోయి వెనక్కి వచ్చి ఏమైంది? అని అడిగారు. నాకు తెలియక నేను ఏంటో అనుకున్నా. ఆ తర్వాత తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇంతలోనే చాక్లెట్స్ వచ్చాయి. టెమ్ట్ అయిపోయా. తీసుకుందామనుకునేసరికి.. బ్రహ్మం తొందరపడి తీసుకోకు. ఒక చాక్లెట్ రూ.1500 అని చెప్పారు. అంతే కామ్ అయిపోయా’’ అంటూ సరదాగా బ్రహ్మీ చెప్పుకొచ్చారు.