Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదల ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టింది.
ఈ విధంగా ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికీ ఈ సినిమాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు పుష్ప సినిమా ఏ మాత్రం హిట్ కాలేదని కొన్ని ఏరియాలలో ఈ సినిమా బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చిందని చెప్పారు.
ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని అక్కడ కలెక్షన్లను రాబట్టడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా హిట్ అయిందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్ట లేకపోయిందని ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చిందని ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి ఓ కారణం ఉందని ఈయన తెలిపారు.
Pushpa: తెలుగులో పెట్టుబడిని కూడా రాబట్టలేక పోయింది
మల్టిఫ్లెక్స్ లలో విపరీతంగా పెరిగిన ఫుడ్ ఐటమ్స్ ధరల వల్ల ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వచ్చి సినిమాని చూడలేని పరిస్థితిలు ఏర్పడ్డాయి. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు పెంచితే ప్రేక్షకులు థియేటర్ కి రారని, ఇలా ప్రేక్షకులు థియేటర్ కి రాకపోతే పూర్తిగా ఇండస్ట్రీని ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికొస్తే దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.