Protein Powder: శరీరానికి తగినంత స్థాయిలో ప్రోటీన్లు అవసరం. ప్రోటీన్లు సరిగ్గా అందితేనే అనేక జీవక్రియలకు ఇబ్బంది కలగదు. అయితే శరీరం ఎక్కువగా శ్రమించినప్పుడు ప్రోటీన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు జిమ్ లో బాగా వర్కవుట్లు చేసినప్పుడు కండరాలు అలసటగా అనుభూతి చెందుతాయి.
కండరాలను శక్తివంతంగా మార్చడానికి, ఏవైనా రిపేర్లు ఉంటే చేయడానికి శరీరానికి ప్రోటీన్ల అవసరం ఉంది. అందుకే జిమ్ కి వెళ్లే వాళ్లు ప్రోటీన్ షేక్ లను తమతో పాటు తీసుకెళ్లి, వర్కవుట్ అవగానే లేదంటే వర్కవుట్ చేస్తుండగానే తాగుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ షేక్ లు మార్కెట్లో విపరీతమైన ధరకు లభిస్తుంటాయి. అయితే సగటు వ్యక్తి వీటిని కొనలేని పరిస్థితి ఉంది.
ప్రోటీన్ షేక్ ని సొంతంగా ఇంట్లో, అతి తక్కువ ధరలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని తయారీకి ఒక గ్లాస్ నీళ్లు, 3 లేదంటే 4 టేబుల్ స్పూన్ల సత్తు పొడిని, నల్లఉప్పును, 1 స్పూన్ జీలకర్ర పొడిని, కొంచెం నిమ్మరసాన్ని తీసుకోవాలి. ముందుగా ఒక పాత్రలో సత్తుపిండి, జీలక్రర పొడి వేసి గోరువెచ్చని నీరు పొసి బాగా కలపాలి. ఆ తర్వాత నిమ్మరసం వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతే ప్రోటీన్ షేక్ రెడీ.
Protein Powder:
శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను అందించడానికి సత్తు పిండి అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సత్తు పిండిలో పుష్కలంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఫలితంగా మనం తినే ఆహారం జీర్ణం అవడంతో పాటు కడుపు, పేగులను శుభ్రంగా చేయడంలో సత్తు పిండి ఎంతో బాగా పని చేస్తుంది.