Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి డిజాస్టర్స్ అంటే పెద్దగా ఏమీ లేవు. ఇటీవలి కాలంలో అయితే ‘ఆచార్య’. అతిపెద్ద డిజాస్టర్. మెగాస్టార్.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ విడుదలయ్యాక వసూళ్లు నేలకు కరిచాయి. నిజానికి కొరటాల శివ అకౌంట్‌లో పడిన తొలి ఫ్లాప్ ఇది. మిర్చి మొదలు.. భరత్ అను నేను వరకూ ఆయన ట్రాక్ రికార్డ్ అదిరిపోయింది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అసలు జనాలకు ఎక్కవు. అయినా కూడా ఆయన మెసేజ్ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
ఒక రకంగా చెప్పాలంటే.. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న కొరటాల శివపై ఆచార్య డిజాస్టర్ భారాన్ని మొత్తం మోపగలమా? మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ల తప్పిదమేమీ లేదా? అంటే.. ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. మెగాస్టార్ మాత్రం ఈ సినిమా డిజాస్టర్ భారాన్ని మొత్తం కొరటాలపై మోపి చేతులు దులిపేసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న గాఢ్ ఫాదర్ మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆచార్య మూవీ ఫ్లాఫ్‌పై స్పందించారు. ఈ స్పందనే ట్రోలింగ్‌కు కారణమైంది.
Chiranjeevi : వారిని కాదని కొరటాల డైరెక్ట్ చేస్తారా?
ఆచార్య సినిమా ఫ్లాప్ తనను బాధించలేదని.. కేవలం తన కొడుకుతో కలిసి తొలిసారిగా నటించిన సినిమా పరాజయం కావడం పట్ల మాత్రం కొంత బాధపడ్డానన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆచార్య సినిమా మొత్తం దర్శకుడు చెప్పిందే చేశానంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఇది నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. అంత పెద్ద స్టార్ హీరోలు.. వారిని కాదని కొరటాల శివ సినిమాను డైరెక్ట్ చేస్తారా? వాళ్లేమైనా మార్పులు చేర్పులు చేయమంటే చేయరా? దానికి కొరటాలను బాధ్యులను చేయడం ఎంత వరకూ కరెక్ట్ అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ మీద కూడా ట్రోల్స్ మొదలయ్యాయి. గతంలో కూడా ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన అనంతరం కూడా స్క్రిప్ట్‌లో చిరు, చెర్రీల ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైందని ఆ కారణంగానే సినిమా ఇంతటి డిజాస్టర్‌ను మూటగట్టుకుందని టాక్ వచ్చింది.