BIGG BOSS: అదేంటి ఈ బిగ్ బాస్ సీజన్ ఊహించినంత రసవత్తరంగా ఏమీ సాగడం లేదుకదా..? ఇక హౌస్ లో అద్భుతాలు ఎలా జరుగుతాయి… మాకు తెలీకుండా ఏం అద్భుతాలు జరిగాయి అని అనుకుంటున్నారు. మీకు అనుకుంటున్నాది అక్షరాల నిజమే..! సీజన్ సిక్స్ ఎలా జరుగుతోంది అనేది కాసేపు పక్కకు పెడితే ఈ వారం హౌస్ లో రెండు అద్భుతాలు జరిగాయట.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్కులు ఇచ్చిన విషయం మీకందరికీ తెలిసిందే…! ఈ టాస్కుల విషయంలో బాలాదిత్య కాస్త డల్ అయ్యాడని గత వారంలోనే బాలాదిత్యపై నాగార్జున కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎలాగైనా నాలుగో వారం తన ప్రదర్శన నిరూపించుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే టాస్కులు ఆడుతూ ఉంటాడు.

మరోవైపు గీతూ కూడా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అవ్వాలనే కోరికతో తనకి కావాల్సినంత సంపాదించుకుని ఉంటుంది. కానీ వీరిద్దరికి ఓ అనుభవం ఎదురౌతుంది. ఇందులో ఒకరితో ఒకరికి కనెక్షన్ ఉంది. చంటి అనుకోకుండా కెప్టెన్సీ పోటీదారుల పోటీ నుండి తొలగిపోవాల్సి వస్తుంది. దీంతో వంట రూంలో పప్పుకి సంబంధించిన విషయంలో రేవంత్ బిహేవియర్ కి ఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే బాలాదిత్య ఫైర్ అయిపోతాడు.
మరోవైపు తాను హస్ లో సొంత అన్నలా భావించిన బాలాదిత్య టిప్పులు ఇవ్వకపోవడంపై గీతూ చాలా బాధపడింది. గీతూకి కాకుండా బాలాదిత్య దీపూకి టిప్పులు ఇచ్చి సపోర్ట్ చేసి ఉంటాడు. దీంతో అక్కడ బాలాదిత్య రేవంత్ మీద కోపం పడటం ఒక అద్భుతంగా, ఇటు ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ గా పేరున్న గీతూ కూడా బాలాదిత్య విషయంలో చాలా బాధపడటం మరో అద్భుతంగా అభివర్ణించాడు నాగార్జున. మొత్తానికి మీరు అనుకున్నట్లుగానే మీకు తెలియకుండానే రెండు అద్భుతాలు జరిగాయని నాగార్జున శనివారం ఎపిసోడ్ లో చెప్తాడు. అదండీ విషయం….!