Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా జాతి రత్నాలు. ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. అయితే ఈ సినిమా కంటే ముందుగా ఈమె యూట్యూబర్‌గా ఫరియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆమె నటించిన జాతి రత్నాలు సినిమాలో చిట్టి అనే పాటతో మరింత ఫేమస్ అయ్యింది ఫరియా అబ్దుల్లా.
ఈ సినిమాలో తన క్యూట్ లుక్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా మొదటి సినిమాతోనే భారీ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించుకుంది.
అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా క్రేజ్ పూర్తిగా మారిపోతుంది అని అభిమానులు అనుకున్నారు. అంతేకాకుండా ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరతాయి అని భావించారు. కానీ అభిమానులు ఊహించిన విధంగా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. అంతేకాకుండా జాతి రత్నాలు సినిమా తర్వాత ఆమె నుంచి ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రాలేదు.
అయితే ఫరియా అబ్దుల్లా సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఫరియా అబ్దుల్లా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ పోటోలలో ఆమె ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని రెడీ అయ్యింది. చీరకట్టులో కూడా తన అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది ఫరియా అబ్దుల్లా. తన నడుము ఎద అందాలు కనిపించే విధంగా పలుచని చీరలో అందాలను ప్రదర్శిస్తూ అదరహో అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.