Viral Video: ఫ్రీగా వస్తే ఏం చేయడానికైనా జనాలు రెడీ ఉంటున్న కాలం ఇది. కాళ్లు చేతులు బాగున్న కష్టపడే శక్తి ఉన్నా కానీ చాలామంది ఫ్రీగా వచ్చే వాటి మీద ఇష్టపడుతూ ఉంటారు. అయితే అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది ఎంతో ఆత్మాభిమానం, విలువలతో బ్రతుకుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి విలువలు, ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న ఓ అవ్వకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ ఆర్టిసీ బస్సులో ప్రయాణించిన ఓ అవ్వను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ‘శభాష్ అవ్వా.. మనిషి అంటే మీలా ఉండాలి’ అంటూ నెటిజన్లు ఆమె చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘మిమ్మల్ని చూసి ఇప్పటి జనాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అంటూ మెచ్చుకుంటున్నారు. అంతలా ఆ ముసలావిడ ఏం చేసిందో తెలుసుకోండి.
కోయంబత్తూరుకు చెందిన ఒక వృద్ధి మహిళ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కింది కాబట్టి టికెట్ ఇవ్వాలని కండర్టర్ కి చెప్పింది. కానీ ఆ కండక్టర్ మాత్రం పర్లేదు అన్నట్టు అన్నాడు. కానీ ముసలావిడకు ఆత్మాభిమానం అడ్డువచ్చింది. బస్సులో ఫ్రీగా ప్రయాణించడానికి ఇష్టంలేని ముసలావిడ తనకు టికెట్ ఇవ్వాలని కండక్టర్ ను మరోసారి అడిగింది. అయినా ఇవ్వకపోవడంతో కండక్టర్ తో గొడవకు దిగింది.
Viral Video:
నిజానికి తమిళనాడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఉచితంగా ప్రయాణించే సదుపాయం ఉంది. కానీ ఆత్మాభిమానంతో బ్రతికే కొంతమంది మాత్రం ఫ్రీ మాకెందుకు అని టికెట్ తీసుకుంటున్నారు. వైరల్ వీడియోలో కనిపించిన అవ్వ కూడా.. తనకు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడింది. ఇలాంటి మంచి వారు ఇంకా ఉన్నారంటూ కొంతమంది నెటిజిన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.