Cholesterol : శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. అందుకే శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలని, కొవ్వును తగ్గించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను చూడాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మారిన జీవన విధానం వల్ల మన శరీరంలో అనవసరమైన కొవ్వు ఎక్కువగా పేరుకుంటోంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.
అధిక కొవ్వు వల్ల హై బీపి, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, పెరిపెరల్ వాస్కులర్ డిసీజ్ తో పాటు డయాబెటిస్ లాంటి సమస్యలకు శరీరంలోని కొవ్వు కారణంగా మారుతోంది. ఆహారంలో చాలా వరకు చెడు కొవ్వును పెంచే వాటిని నివారించాలి. కొవ్వును తగ్గించుకోవడంలో భాగంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినకూడదని వైద్యులు సలహా ఇస్తుంటారు.
ఇంట్లో తాజాగా ఆహారాలను వండుకొని తినాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే వెజిటేబుల్స్, ఓట్స్, హోల్ గ్రెయిన్స్, బీన్స్, బెండ, నట్స్, వెజిటేబుల్ ఆయిల్స్, పండ్లని డైట్‌లో తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రమే అంది, అనవసరమైన కొవ్వులు తగ్గుతాయి. దీనికి తోడు మద్యం, పొగాకు లాంటి వాటికి దూరంగా ఉండాలి.
Cholesterol :
కొవ్వును తగ్గించుకోవడానికై ఆహారంతో పాటు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు చెబుతుంటారు. అందుకే కొవ్వును తగ్గించేందుకు జిమ్ లో వర్కవుట్ చేయడం లేదంటే యోగా చేయడం, స్విమ్మింగ్ చేయడం లాంటివి చేయాలని సలహా ఇస్తుంటారు. శరీరానికి శ్రమ కలిగించేలా ఏం చేసినా, దాని వల్ల కొవ్వు కరుగుతుంది.