జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రష్మీ గౌతమ్ అతి కొద్దికాలంలోనే తన అందంతో పాటు యాంకర్ గా కూడా తనదైన శైలిలో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పొట్టి పొట్టి డ్రెస్ లతో జబర్దస్త్ కి ఫేమ్ తీసుకొచ్చింది. ఇక ఈ బ్యూటీ జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా కూడా చాలా సినిమాలలో నటించింది. అయితే సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడంతో కెరియర్ గాడితప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు అయితే లేవు. కానీ యాంకర్ గా మాత్రం వరుస షోలతో దూసుకుపోతుంది.
ఈటీవీలో అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ కి కూడా యాంకర్ గా రష్మీని తీసుకుంటున్నారు. ఆమెని మల్లెమాల, ఈటీవీ యాజమాన్యం ఎంకరేజ్ చేస్తుంది. ఇక రష్మీ కూడా ఆరంభంలో బాషతో కొంత ఇబ్బంది పడిన ప్రస్తుతం గాడిలో పడింది. దీంతో యాంకర్ గా ఆమె స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇక అనసూయ సినిమాలపై ద్యాస పెట్టడంతో యాంకరింగ్ తగ్గించేసింది. ఇక శ్రీముఖి జీతెలుగు, స్టార్ మాకి ఎక్కువగా చేస్తుంది.
దీంతో ఈటీవీ ఫస్ట్ ఛాయస్ గా రష్మీని తీసుకుంటున్నారు. జబర్దస్త్ కి సంబందించిన రెండు షోలని ప్రస్తుతం రష్మీనే హ్యాండిల్ చేస్తుంది. మరో వైపు తన హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో కుర్రకారుని ఆకట్టుకుంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటుంది. అయితే నటిగా మాత్రం ఆమెకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కానీ నటిగానే తనని తాను రిప్రజెంట్ చేసుకోవాలనే డ్రీమ్ రష్మీకి ఉంది. అయితే ఆమె కల సాకారం అయ్యేలా స్టార్ నటిగా ఎప్పుడు మారుతుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే స్టార్ యాంకర్ గా టెలివిజన్ పై ప్రేక్షకులని మాత్రం ఈ బ్యూటీ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది.