నాటకం చూసిన స్పృహ కోలోయిన కార్తీక్‌ని హాస్పిటల్‌కి తీసుకెళుతుంది దీప. బలవంతంగా గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని చెబుతాడు కార్తీక్‌ని ట్రీట్ చేసిన డాక్టర్. దాంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతుంది దీప. అనంతరం గతం గుర్తుకురాని కార్తీక్, మోనితతో వెళ్లిపోతాడు. మార్గమధ్యలో మోనిత కారుకి డాష్ ఇస్తాడు దుర్గ. అతన్ని చూసి పారిపోతున్న మోనిత వెంటపడతాడు దుర్ద. అమ్మ నాన్న ఇక లేరని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది సౌర్య.
దుర్గ నుంచి తప్పించుకున్న మోనిత.. అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఊరికి ఎవరూ రారని, ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటే ఒకరి తర్వాత ఒకరు తెలిసి వస్తున్నారో.. తెలియక వస్తున్నారో అర్థం కావటం లేదని అనుకుంటూ బాధపడుతుంది. మళ్లీ తనలో తానే.. ‘ఎంతమంది వచ్చినా గతం గుర్తు చేయడం వల్ల కార్తీక్ ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన దీప అంత సాహసం చేయదు. ఎవరైనా చేసినా చేయనివ్వదు. ఆ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదు’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది. ఇంతలో గదిలో పడుకున్న కార్తీక్, దీప, సౌర్య రౌడీ అంటూ కలవరిస్తూ ఉంటాడు. దీప త్వరగా రా అంటూ పిలుస్తుంటాడు. అది విన్న మోనిత చాలా కంగారు పడిపోతుంది. అన్ని మర్చిపోయాడు అనుకుంటే గతం గుర్తొచ్చిందా ఏమిటి? ఇలా కలవరిస్తున్నాడు అని అనుకుంటుంది. అక్కడికి వచ్చిన శివ అది విని ఏమిటి మేడం అని అడుగుతాడు. ఏమి లేదు నువ్వువెళ్లి షాప్ క్లోజ్ చెయ్ అని అతన్ని కసురుతుంది. బయటికి వెళ్తున్న శివ నిజంగా దీపక్క, కార్తీక్ గారి భార్య ఏమో అని అనుమానంగా ఆలోచిస్తూ వెళ్తాడు.
తెల్లవారిన తర్వాత.. మోనిత కారు డాష్ ఇచ్చిన ఏరియాలోనే ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు దుర్గ. ఇంతలో దుర్గకి దీప కనిపిస్తుంది. ఏమిటి దీపమ్మ ఇక్కడున్నారని అడుగుతాడు. కార్తీక్ పిల్లలు ఏరి అని ఆరా తీస్తాడు దుర్గ. అతన్ని చూసిన దీప దేవుడులా వచ్చాడని అనుకుంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మోనిత చేస్తున్న కుట్రలను కూడా వివరిస్తుంది. దాంతో.. మోనిత చాలా మోసాలు కుట్రలు చేస్తుందని తెలుసు కానీ, మరి ఇంత దారుణానికి ఓడి కడుతుందని అనుకోలేదని దుర్గ అంటాడు. అందుకే మోనితకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అంటాడు.
మరోవైపు కార్తీక్ తల పట్టేసినట్టు ఉందని తలపట్టమని మోనితని పిలుస్తాడు. గతం గుర్తొస్తుందేమోనని భయపడుతూ డాక్టర్ వద్దన్నారు కదా అని అంటుంది మోనిత. అప్పుడు ఒక డాక్టర్ లాగా ఏం కాదని సమాధానం ఇస్తాడు. ఇంతలో మోనితని ఎవరో పిలుస్తున్నట్టు వినిపించి బయటకు వస్తుంది. తలుపు దగ్గర దుర్గని చూసి షాక్ అవుతుంది. ‘ఏంటి బంగారం అలా చూస్తున్నావ్’ అంటూ కవ్వింపుగా మాట్లాడుతాడు దుర్గ. అది చూసిన మోనిత.. ‘నువ్వు ఎందుకు వచ్చావు. నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో’ అని దుర్గని బెదిరిస్తుంది. అంతలో శివ అక్కడికి వచ్చి ఎవరు నువ్వు బయటికి వెళ్లు అంటాడు. దాంతో.. దుర్గని కొట్టమని శివతో చెప్తుంది మోనిత.
ఇంకోవైపు.. చటుక్కున మాయమైన దుర్గ కోసం చూస్తూ ఉంటుంది దీప. అంతలో దీప దగ్గరకు వస్తాడు దుర్గ. ‘మోనిత ఇంటికి వెళ్లాను. ఒక జలక్ ఇచ్చి వచ్చాను. ఇంక దాని ఆట కట్టించడం నా వంతు. నువ్వేమీ భయపడవద్దు. అంతా నేను చూసుకుంటాను’ అని దీపకి మాట ఇస్తాడు దుర్గ.
అనంతరం.. రూమ్ లో నుంచి బయటికి వచ్చిన కార్తీక్ ఎవరు వచ్చారని అడుగుతాడు. ఎవరూ లేరని కంగారుపడుతూ ఇల్లు మారుదాం కార్తీక్ అని అంటుంది మోనిత. ఎందుకు ఇక్కడ బానే ఉందిగా అంటాడు కార్తీక్. ‘లేదు కార్తీక్. ఈ ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్దాం’ అని అంటుంది మోనిత. సరేలే చూద్దాం అంటూ శివ ఎక్కడ అంటూ బయటకు వెళ్తాడు. లాన్ లో శివ పడిపోయి ఉండడం చూసిన కార్తిక్ మోనిత అని పిలిచి నీళ్లు తీసుకురా అంటాడు. మోనిత వెళ్లకుండా కార్తీక్ నే చూస్తూ అలాగే నిలబడి ఉంటుంది. శశికళ అని పిలిచి నీళ్లు తెమ్మంటాడు కార్తీక్. నీళ్లు చల్లి.. శివని లేపి ఏమైందని అడుగుతాడు. మేడం వాళ్ల క్లోజ్ ఫ్రెండ్ ని బయటికి పంపడానికి.. అతని మీద చేయి వేశాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటాడు శివ. అప్పుడే అక్కడికి వస్తాడు దుర్గ నా పేరు దుర్గా. నేను పని మీద వచ్చాను అని మోనిత క్లోజ్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటాడు. అంతలో దీప, శివ కోసం గోంగూర పచ్చడి తీసుకొని వచ్చి.. ఇతను ఎవరు డాక్టర్ బాబు అని అడుగుతుంది. దుర్గ, మోనిత క్లోజ్ ఫ్రెండ్ అంట అని చెప్తాడు కార్తీక్. మోనిత మాత్రం.. మనసులో దీప, దుర్గా కలిసి ఏదో చేయాలని చూస్తున్నారని మనసులో అనుకుంటూ ఉంటుంది. దుర్గ, కార్తీక్‌తో మోనిత నాపై అలిగిందని నాలుగు రోజులు ఇక్కడే ఉండి అలక తీరుద్దామని వస్తే ఇంకా కోపంగా ఉండి తనను బయటకు వెళ్లమంటుందని, అక్కడికి నుంచి వెళ్లబోతాడు దుర్గ. ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్తాడు కార్తీక్. దాంతో ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. మోనితతో దుర్గ క్లోజ్ గా ఉండడం చూస్తాడు కార్తీక్. ఆ విషయాన్ని తలుచుకుంటూ దీప దగ్గర టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తిక్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇది ఇంతకుముందు జరిగిందా.. ఇప్పుడే జరుగుతుందా అని అరుస్తూ ఉంటాడు. మోనిత దీపకు చేసిన కుట్ర మళ్లీ తనకే తిరిగి తగులుతుందా అనేది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.