టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకునే దిశగా తెలుగమ్మాయి అనన్యా నాగళ్ళ దూసుకుపోతుంది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా ఫ్రేమ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. తరుచుగా ఫోటోషూట్ లు చేస్తూ అందాల ప్రదర్శనతో అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చివరిగా వకీల్ సాబ్ సినిమాతో సందడి చేసింది. అందాల ప్రదర్శన ఎంత గట్టిగా చేసిన ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదనే చెప్పాలి.
నటిగా కూడా ఇప్పటికే మంచి సినిమాలు చేసి ప్రూవ్ చేసుకుంది. శాకుంతలం సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తుంది. దుశ్యంతుడి భార్యగా అనన్య నాగళ్ళ పాత్ర ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీపై ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ న్యూస్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో ఓ బడా ప్రొడ్యూసర్ ఇంటికి అనన్యా నాగళ్ళ కోడలిగా వెళ్లబోతుంది అనే మాట వినిపిస్తుంది. ప్రొడ్యూసర్ చిన్న కొడుకుతో అనన్య గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ లో ఉందనే టాక్ నడుస్తుంది.
ఈ నేపధ్యంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇప్పటికే ఇంట్లో వారికి కూడా తమ రిలేషన్ గురించి చెప్పడం జరిగిందని, వారు కూడా ఒకే చెప్పారని చెప్పుకుంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని టాక్. పెళ్లి తర్వాత నటనకి కూడా ఈ బ్యూటీ స్వస్తి చెప్పడానికి రెడీగానే ఉందని, ఈ లోపే వీలైనన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతుందని టాక్ నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది అఫీషియల్ గా బయటకి వచ్చే వరకు తెలియదు.