BIGG BOSS: బిగ్ బాస్ రియాలిటీ షోలో కెప్టెన్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో మీకందరికీ తెలిసిందే..! కెప్టెన్ అవడం కారణంగా ఒక వారం నామినేషన్స్ నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో పని చేయించాల్సి ఉంటుంది కానీ చేసే అవసరం లేదు. అది వారిష్టం అనుకోండి. కొంత మంది కెప్టెన్ అయినా కూడా హౌస్ లో పనులు చేస్తారు.
ఇంతటి ప్రాధాన్యత గల కెప్టెన్ కోసం హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ పోటీ పడరు చెప్పండి. ఈ వారం కెప్టెన్సీ కోసం హౌస్ లో చాలా మంది ప్రయత్నం చేస్తారు. కానీ ఫైనల్ రౌండ్ మాత్రం ఈ వారం ఊహించని విధంగా ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎంపిక అవుతారు. దీంతో ఇందులో ఫైనల్ గా ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేయడం కోసం బిగ్ బాస్ బ్లాక్ బాస్టర్ కెప్టెన్ అనే టాస్క్ పెడతాడు.

ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో పోటీదారులు స్టార్ట్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ వరకు వెళ్లి అక్కడ ఉన్న పిక్ లో నుంచి కెప్టెన్ పదానికి సంబంధించిన ఒక్కో ఆల్ఫాబిట్ ని తీసుకుని తిరిగి స్టార్ట్ పాయింట్ కి వచ్చి అక్కడ ఉన్న ఫ్రేంలో వారి రోపై వాటిని హుక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు పాయింట్ కి మధ్య పోటీదారులు కేవలం వారికి ఇచ్చిన రెండ బాక్స్ ల పై కాళ్లు పెడుతూ మాత్రమే నడవాల్సి ఉంటుంది.
ఎవరైతే వారి రోలో ముందుగా కెప్టెన్ అనే పదాన్ని పూర్తిగా హుక్ చేస్తారో వారు ఈ టాస్క్ లో గెలిచి ఇంటి తదుపరి కెప్టెన్ అవుతారు. ఈ టాస్క్ లో రెండు బాక్స్ లు కాళ్ల కింద పెట్టుకుంటూ పోవడం చాలా కష్టం. అయినా సరే కెప్టెన్ పోటీదారులుగా ఉన్న కీర్తి, దీపూ, శ్రీసత్య టాస్క్ ఆడతారు. వీరి ముగ్గురిలో కీర్తి ఈ టాస్క్ ను ముందుగా పూర్తి చేస్తుంది. దీంతో కీర్తిని ఈ వారం కెప్టెన్ గా ఎంపిక అవుతుంది. కెప్టెన్ గా ఎంపిక అయిన కీర్తికి బిగ్ బాస్ ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్ కెప్టెన్ గా ఎంపిక అయ్యారు.