రాధ పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతుంది జానకి. మాధవే తనని కిందకు తోసేశాడని చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ అది రాధకు అర్థం కాదు. మరోవైపు సత్య దేవికి సారీ చెబుతుంది. దాంతో మళ్లీ ఇంటికి వస్తుంది దేవి. కానీ ఎప్పటిలాగే ఆదిత్య, సత్యలకు అడ్డు వస్తుంది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న రాధ దగ్గరికి వెళ్లిన మాధవ్ ఏం చేస్తాడో సెప్టెంబర్ 30 ఎపిసోడ్‌లో తెలుసుకుందాం..
జానకమ్మకు కథలు చెప్తుంది చిన్మయి. రాధ జావ తీసుకొచ్చి తాగిస్తుంది. అది చూసి రామ్మూర్తి ‘రాధకు చేతులెత్తి నమస్కారం చేస్తాడు. నీకు మేం ఏం చేయలే కానీ మాకోసం నువ్ తల్లిలా సేవ చేస్తున్నావ్. ఏం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలమ్మా’ అంటాడు. మా తల్లికి అయితే చేయనా. ఇడిచిపెట్టి పోతానా అంటుంది రాధ. మాకోసం ఇంత చేస్తున్నన నీకోసం ఏమైనా చేస్తామమ్మా అంటాడు రామ్మూర్తి. నాకు కావాల్సిన రోజు అడుగుతానని రాధ చెప్పగా.. నీకు కావల్సింది చేసి పెడతానని మాటిస్తాడు రామ్మూర్తి. ఆదిత్యతో కారులో బయలుదేరుతుంది దేవి. నానమ్మకు త్వరగా నయం కావాలంటే మంచి డాక్టర్ కావాలని చెప్తుంది దేవి. మా ఇంట్లో వాళ్లందరూ చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని వివరిస్తుంది. అంతలోనే కారు తీసుకెళ్లి పెద్ద డాక్టర్ ఇంటి ముందు ఆపుతాడు ఆదిత్య.
సీన్ కట్ చేస్తే.. జానకి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది కానీ అది రాధకు అర్థం కాదు. తనకి మాత్రలు ఇచ్చి నయమవుతుంది వేసుకోమని చెప్తుంది. అది చూసి చిన్మయి పెన్ను, పేపర్ తీసుకొచ్చి దాని మీద రాయమని చెప్తుంది. అపుడే అక్కడకు వచ్చిన మాధవ్ ఎందుకు రాధ.. అమ్మని ఇబ్బందిపెడుతున్నారు అని అంటాడు. అంతలోనే ఆదిత్య పెద్ద డాక్టర్‌ని వెంటపెట్టుకుని వస్తాడు. జానకమ్మని చెక్ చేసి పాత రిపోర్ట్స్ అడుగుతుంది డాక్టర్. నేను తీసుకొస్తానంటూ వెళ్తుంది చిన్మయి. ఆ తర్వాత అందరిలో ఉత్కంఠ నెలకొంటుంది. అపుడే డాక్టర్ నథింగ్ టు వర్రీ.. ట్రీట్‌మెంట్ చేస్తే వన్ వీక్‌లో కోలుకుంటుందని శుభవార్త చెప్తుంది. మాకు కూడా కావల్సింది అదేనంటూ అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ మాధవ్‌లో మాత్రం కంగారు మొదలవుతుంది. తనకెవరూ సహకరించరని ఆందోళన పడతాడు.
ఆ తర్వాత సీన్‌లో సత్య తన అక్క రుక్కు చెప్పిన మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది సత్య. అది గమనించి అక్కడికి వస్తుంది దేవుడమ్మ. ‘సత్య ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటావ్. వాడే అనుకుంటే నువ్ కూడా ఇంతకుముందులా ఉండట్లేదు. మనం ఎన్నిసార్లు అనుకున్నా వాడి ఆలోచన మారాలి’ అంటుంది. ‘నేను ఆలోచిస్తున్నది అది కాదు. జానకమ్మకి బాలేకపోతే డాక్టర్‌ని తీసుకురమ్మని రాధ ఆదిత్యకు చెప్పడం ఏంటి. ఆదిత్య అన్నీ వదిలేసి పరుగున వెళ్లడం ఏంటి? ఆదిత్య కూడా ముందూ వెనుక ఆలోచించకుండా పరుగులు తీయడమేంటి?’ అని అత్తని ప్రశ్నిస్తుంది సత్య. అపుడే దేవుడమ్మ అదేంటి సత్య.. నాకు ఆరోగ్యం బాలేకపోతే రామ్మూర్తి వాళ్లు రాలేదా. అయినా ఆదిత్యకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉంటుంది కాబట్టి అలా చెప్పారేమో. అయినా నువ్ అన్నింటికి ఇలా లోతుగా ఆలోచించడం నీకే మంచిది కాదు. నీ మనసును నువ్ ఇలా పాడు చేసుకుంటున్నావ్ కాబట్టే నీకీ మధ్య కోపం ఎక్కువైంది’ అంటూ హితబోధ చేస్తుంది దేవుడమ్మ.
అక్కడ మాధవ్ మాత్రం తల్లిని కోలుకోనీయకుండా వెంటాడుతూనే ఉంటాడు. జానకి దగ్గరికి వెళ్లి ‘అమ్మా ఇలా కంగారు పడితే ఎలా. నేను నీ కన్న కొడుకుని. ఆ ఆదిత్య ఎవరో పెద్ద డాక్టర్‌ని తీసుకొస్తాడట కదా.. నీకు మాటలు వస్తే నా పరిస్థితేంటమ్మా?’ అంటూ వీల్ చైర్‌ని తోసుకుంటూ వెళ్తాడు. గతం గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది జానకి. రాధని, దేవిని ఈ ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నావా. బిడ్డ తప్పు చేస్తే కాపాడేది తల్లి. కానీ నువ్ శిక్షించాలనుకుంటే ఎలాగమ్మా.. ఆ రోజు ఇదే మెట్ల దగ్గర ఏం జరిగిందో గుర్తుందా? అమ్మా ఆ అవకాశమే నాకు ఇప్పుడు కూడా ఉంది కానీ మళ్లీ అలాంటి పనులు చేసేంత దుర్మార్గుడిని కాదు’ అంటూ భయపెడతాడు మాధవ్. మరి జానకికి నయమవుతుందో లేదో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..