Beauty Tips: మెరిసే ముఖం, చర్మాన్ని ఎవరు మాత్రం కోరుకోరు. అయితే చాలామంది తమ ముఖాన్ని ఎలా మెరిసేలా తయారు చేసుకోవాలో తెలియక అనేక రకాల చిట్కాలను ట్రై చేస్తూ ఉంటారు. రాత్రిపూట పాటించే కొన్ని చిట్కాల వల్ల ఉదయం లేచిన తర్వాత ముఖంలో వచ్చే మార్పులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి మీకు కూడా ముఖం మెరిసేలా కావాలంటే రాత్రి పూట ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
మనలో చాలామందికి కొబ్బరినూనెను జుట్టుకు వాడటం తెలిసే ఉంటుంది. కొబ్బరి నూనెలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి, జుట్టు దృఢంగా మారడానికి సహాయపడతాయి. అయితే ఇదే కొబ్బరి నూనెను వాడి ముఖాన్ని కూడా ఎంతో మెరిసేలా తయారు చేసుకోవచ్చు. మరి కొబ్బరినూనెతో మెరిసే ముఖాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల చర్మం అనేక సమస్యలను తట్టుకోగలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని అరచేతికి నూనె రాసి ముఖం మీద, మరీ ముఖ్యంగా ముఖం మీద ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ రాసి కొద్దిసేపు మసాజ్ చేయాలి. తర్వాత రాత్రి మొత్తం అలాగే వదిలెయ్యాలి. ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు పోయి చర్మం బిగుతుగా తయారవుతుంది.
Beauty Tips:
రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుందట. దీని వల్ల కొద్ది రోజుల్లోనే ముఖానికి మంచి మెరుపు వస్తుంది. మెల్లిగా ముఖం మంచి రంగులో కనిపించడం కూడా జరుగుతంది. దీనిని మరింత ప్రయోజనకరంగా వాడాలనుకుంటే కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి కూడా వాడుకోవచ్చు. రాత్రి నూనెతో మసాజ్ చేశాక, ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.