Egg for Weight loss: గుడ్డు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు. అందుకే ‘సండే హో యా మండే రోజ్ ఖావ్ అండే’ (ఆదివారమైనా,సోమవారమైనా ప్రతిరోజు తినండి గుడ్డు) అంటూ ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. కాగా గుడ్డును మరింత ఆరోగ్యానికి మేలు చేసేదిలా తయారు చేయడానికి కింద తెలిపిన మూడు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మిరియాల పొడి:
చాలామంది గుడ్లను ఆమ్లెట్ రూపంలో వేసినప్పుడు పైనుండి మిరియాల పొడి వేసి తినడం అలవాటుగా ఉంటుంది. నిజానికి ఇది చాలా మంచిది. ఉడకబెట్టిన గుడ్డు మీద కూడా మిరియాల పొడి చల్లుకొని తినడం వల్ల మరింత మేలు కలుగుతుంది.
క్యాప్సికమ్:
హోటల్ కి వెళ్లినప్పుడు ఎగ్ కర్రీని ఆర్డర్ చేస్తే మామూలుగా గుడ్డుతో పాటు క్యాప్సికమ్ వేసి తయారు చేసి ఇస్తుంటారు. ఇది గుడ్డులోని పోషకాలకు మరింత బలాన్ని, మన శరీరానికి మేలు చేసేలా తయారు చేస్తుంది.
Egg for Weight loss: కొబ్బరినూనె:
కొబ్బరి నూనెలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. అయితే కొబ్బరినూనెతో వేసిన ఆమ్లెట్ తింటే ఆరోగ్యానికి మంచిదట. పైగా ఇలా ఆమ్లెట్ తినడం వల్ల బరువు తగ్గుతారట.