జానకమ్మని చూడడానికని బయలుదేరుతుంది సత్య. దేవిని ఓదార్చమని చెబుతుంది అత్త దేవుడమ్మ. దాంతో అక్క రాధ దగ్గరికి వెళ్తుంది సత్య. తన భర్త గురించి చెప్పి బోరున విలపిస్తుంది. అపుడు రాధ నీ భర్తతో నువ్ హ్యాపీగా ఉంటావని మాటిస్తుంది. ఆ తర్వాత రుక్కు, ఆదిత్యలు రహస్యంగా కలుస్తారు. అపుడే సత్యకు నువే తన అక్క రుక్మిణివని తెలుసంటూ బాంబ్ పేల్చుతాడు ఆదిత్య. ఆ తర్వాత సెప్టెంబర్ 29 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రుక్మిణి, ఆదిత్యల పెళ్లి ఫొటో చూసి బాధపడుతుంది జానకి. ‘అంత పెద్ద ఇంటికి కోడలువై ఉండి ఎవరో అనామకురాలిగా నా ఇంట్లో తలదాచుకున్నావా. అలాంటి నీ మీద నా కొడుకు ఆశ పడుతున్నాడు. నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి. నీ లాంటి మంచి మనిషి పది కాలాల పాటు చల్లగా ఉండాలి’ అని రాధను ఉద్దేశించి అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత సీన్‌లో సత్య అంతుపట్టని ఆనందంతో కనిపిస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఆదిత్యతో నేను అక్క దగ్గరికి వెళ్లి వచ్చానని, దేవికి స్వారీ చెప్పానని చెప్తుంది. దాంతో ఆదిత్య హ్యాపీతా ఫీలవుతాడు. దేవి తిరిగి ఎప్పటిలాగే మనింటికి వస్తుందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు ఆదిత్య. నేను వెళ్లిన తర్వాత దేవి కన్విన్స్ అవ్వదా? అంటూ బదులిస్తుంది సత్య. ఇదంతా చాటుగా గమనిస్తుంది దేవుడమ్మ. ఆదిత్య తెలియకుండానే తప్పు చేస్తున్నాడని సత్యను ఉద్దేశించి అనుకుంటుంది మనసులో. దేవి వల్ల ఆదిత్య, సత్యల మధ్య మనస్పర్థలు పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ జానకమ్మ దగ్గరికి వెళ్తాడు. ‘నిన్ను ఇలా చూస్తే చాలా బాధగా ఉందమ్మ. ఎందుకమ్మ చూసుకోకుండా మెట్ల మీది నుంచి జారిపడ్డావ్. చెప్పకమ్మా అంటే వినలేదు. నాతో ఇంత పెద్ద తప్పు చేయించావ్. ఎవరు ఎలా ఉన్నా.. నాకు నా రాధ కావాలి’ అంటాడు. ఆ మాటలకు కోపంతో రగిలిపోతుంది జానకి. అంతలోనే పిల్లలు అక్కడికి వచ్చి ‘నీకేం కాదు నానమ్మ. నీకు నయం అయ్యేవరకు మేం జాగ్రత్తగా చూసుకుంటాం. అసలు నువ్ మెట్ల మీది నుంచి ఎట్ల పడ్డావ్. చక్కెర వచ్చిందా’ అంటూ దేవి అడగ్గా.. మాధవ్ వైపు చూపిస్తుంది జానకి. కానీ అసలు విషయం అర్థం కాదు పిల్లలకు. అపుడే రాధ పాలు తీసుకుని వచ్చి తాగిస్తుంది జానకికి. దేవి ‘నాయనా. అవ్వని పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఆఫీసర్ అంకుల్‌ని అడిగితే తీసుకెళ్తాడు.’ అంటారు పిల్లలు మాధవతో. ‘మీ నానమ్మకు మాట వస్తే అది నా ప్రాణాలకే ప్రమాదం. మీ నానమ్మ మాట ఆ గొంతులోనే శాశ్వతంగా ఆగిపోవాలి’ అనుకుంటాడు లోపల. దేవిని సైగలతో పిలుస్తుంది జానకి. ‘మాధవ గురించి మనసులో తిట్టుకుంటుంది’.
మరుసటి రోజు ఉదయం ఆదిత్య సత్యని పిలిచి కాఫీ అడుగుతాడు. అంతలోనే దేవుడమ్మ వచ్చి పర్లేదే అంత తీరిక దొరికిందా అంటుండగానే దేవి వచ్చి నాకు కూడా కాఫీ కావాలి అంటుంది. ఆదిత్య వెల్లి దేవిని హగ్ చేసుకుంటాడు. మళ్లీ ఈ ఇంటికి రావేమోనని బాధపడ్డా అంటాడు. ‘రాకుండా ఎట్ల ఉంటా. ఇది కూడా నా ఇల్లే కదా. మా చిన్మమ్మ తిడితే మా అమ్మ తిట్టినట్లే కదా’ అంటుంది హుషారుగా. దేవుడమ్మ కూడా దేవిని సరదాగా ఆటపట్టిస్తుంది. వచ్చి నాతో మాట్లాడకుండా మీ ఆఫీసర్‌తోనే మాట్లాడావ్ కదా అంటూ అలిగి బుంగమూతి పెడుతుంది. దేవి ముద్దు పెట్టగానే కూల్ అవుతుంది దేవుడమ్మ. ‘నీకు మనుషుల్ని మాయ చేయడం బాగా తెలుసే’ అంటుంది. అయినా పనిగట్టుకునే వచ్చినవ్ ఏంటే అని అడగ్గా.. ‘మాయమ్మ ఓ ముచ్చట చెప్పమని పంపింది. అవ్వ మస్తు బాధపడుతుంది కదా. నీకు చెప్పి పెద్ద డాక్టర్‌ని తీసుకురమ్మంది’ అంటుంది ఆదిత్యతో. అలాగేనమ్మా అంటూ దేవిని తీసుకుని వెళ్తాడు ఆఫీసర్. సత్య అడ్డుపడి కాఫీ తాగమని చెప్పినా.. మళ్లీ వచ్చి తాగుతా అంటూ బదులిస్తాడు.
ఆ తర్వాత సీన్‌లో వంట గదిలో ఉన్న రాధని దొంగలా చూస్తాడు మాధవ. అది గమనించి రాధ విసుక్కుంటుంది. దగ్గరికి వెళ్లి రాధతో మాట్లాడతాడు మాధవ్. ‘నన్ను చూస్తుంటే నీకు కోపం వస్తుంది కానీ.. నాకు మాత్రం నీమీద అభిమానం పెరుగుతుంది. మాఅమ్మని చూపించడానికి నువ్ ఆదిత్య చాలా కష్టపడుతున్నారు. చూద్దాం మీ ప్రయత్నం ఫలిస్తుందో లేదో. ఆ దేవుడు మీకు ఎంత వరకు సహకరిస్తాడో’ అంటాడు. జానకమ్మ దగ్గర కూర్చుని కథలు చెప్తుంది చిన్మయి. రాధ జావ తీసుకుని వచ్చి తాగిస్తుంది జానకమ్మకు. మరి ఆదిత్య ప్రయత్నం ఫలిస్తుందా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..