బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన కంటిస్టెంట్ లు ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సంచలనంగా మారుతున్నారు. హౌస్ లోనుంచి తమని కావాలని ఎలిమినేట్ చేసి బయటకి పంపించారనే ఫీల్ అవుతున్నారు. వారు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటిగా బయటకి వచ్చిన కంటిస్టెంట్ షాని సోలొమన్ తనకి హౌస్ లో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయని, తనకంటే తక్కువ అర్హత ఉన్నవారు అక్కడ ఉన్నారని కామెంట్స్ చేశాడు.
అలాగే కావాలని తనని బయటకి పంపించేశారని చెప్పాడు. తరువాత బయటకి వచ్చిన అభినయశ్రీ కూడా ఇదే మాట చెప్పింది. కావాలని బిగ్ బాస్ టీమ్ తనని ఆట బాగా ఆడటం లేదనే కారణం చూపించి తక్కువ ఓటింగ్స్ వచ్చాయని బయటకి పంపించారని చెప్పింది. ఆ షోలో తనకి అన్యాయం జరిగిందని చెప్పింది. తాజాగా మూడో వారం నేహా చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే తన ప్లేస్ లో ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అవ్వాలని, అయితే ఏవో రీజన్స్ చూపించి, నన్ను తప్పుగా రిప్రజెంట్ చేసి హౌస్ నుంచి బయటకి పంపిచేశారని చెప్పింది.
తన ఎలిమినేషన్ ఆడియన్స్ కోరుకున్నది కాదని కూడా కామెంట్స్ చేసింది. ఇనాయాకి ఆర్జీవీ సపోర్ట్ ఉందని, నాగార్జున, ఆర్జీవీ మంచి ఫ్రెండ్స్ అని ఈ కారణంగానే ఇనాయా అర్హత లేకపోయిన హౌస్ లో ఉంటుందని చెప్పింది. ఈ విషయంలో హోస్ట్ గా నాగార్జున ఫెయిర్ గా హ్యాండిల్ చేస్తున్నట్లు అనిపించడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది. ఇలా హౌస్ నుంచి బయటకి వచ్చిన వారు చేస్తున్న కామెంట్స్ పై బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఇప్పటి వరకు ఏ విధంగా కూడా స్పందించలేదు.