నాటకం చూసిన కార్తీక్‌కి గతం తాలుకు జ్ఞాపకాలు వస్తాయి. వాటితో తల్లడిల్లిన కార్తీక్ స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో.. డాక్టర్ అన్నయ్య సహాయంతో భర్తని ఆసుపత్రికి తీసుకెళ్తుంది దీప. కార్తీక్ వంటలక్కతో వెళ్లాడని తెలిసిన మోనిత కమ్యూనిటీ హాల్‌కి వెళుతుంది.
స్పృహ తప్పిపడిపోయిన కార్తీక్‌ని డాక్టర్ అన్నయ్య, దీప కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఇంకోవైపు మోనిత నాటకం జరిగిన హాల్లో ఎవరూ లేకపోవడంతో కంగారు పడుతుంది. అప్పుడే అటుగా నాటకంలోని ఓ వ్యక్తిని విషయం ఏంటని అడుగుతుంది. ఏం నాటకం వేసారని అడుగుతుంది మోనిత. అతను నిజ జీవితంలో దీప అనే ఆవిడకు జరిగిన విషయాలను నాటకంగా వేశారని, ఆమె చాలా బాగా నటించిందని, అది చూసి ఆమె భర్త స్పృహ తప్పి పడిపోగా హాస్పిటల్ కి తీసుకెళ్లారని చెప్తాడు. ఏ హాస్పిటల్ లో తెలియని మోనిత అటుగా వచ్చిన తన అసిస్టెంట్ ఫోన్ తో దీపకి కాల్ చేసి ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. దీప నీకెందుకు చెప్పాలి అని చెప్పను అని కోప్పడుతుంది. కార్తీక్ కి ఏమైనా జరిగితే ఊరుకోనని దీపని బెదిరిస్తుంది మోనిత. అనంతరం హాస్పిటల్లో కార్ పార్క్ చేసి వచ్చిన డాక్టర్ అన్నయ్యతో మోనిత కాల్ చేసిందని, అది ఎలాగైనా తెలుసుకొని వస్తుందని అంటుంది దీప. కార్తీక్ కి గతం గుర్తొచ్చి తనను గుర్తుపట్టి మోనిత చేసిన కుట్రలన్నీ గుర్తొచ్చి, దానికి బయటకు గెంటివేయాలని అది నా కోరిక అని అతనితో చెప్తుంది దీప.
కార్తీక్‌కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్.. గతం తాలూకు జ్ఞాపకాలను బలవంతంగా గుర్తు చేయడం వల్ల.. మెదడులోని నరాలు ఒత్తిడికి గురై అతను స్పృహ కోల్పోయాడని చెప్తాడు.అలాగే.. ‘ఇప్పుడు గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మళ్లీ ఇలా బలవంతంగా గుర్తు చేసే ప్రయత్నం చేస్తే నరాలు చిట్లి చనిపోయే ప్రమాదం ఉంది. అనుకోకుండా జరిగినట్టుగా గుర్తు చేసే ప్రయత్నం చేస్తే మంచిది’ ఆ డాక్టర్ చెబుతాడు. ఇంతలో పరుగు పరుగున అక్కడికి వస్తుంది మోనిత. రాగానే కార్తీక్ అని గట్టిగా అరవబోతుంది మోనిత. దాంతో.. ‘పేరుకి పెద్ద డాక్టరువి కదా. హాస్పిటల్లో అరవకూడదని తెలీదా’ అని మోనితని వారిస్తుంది దీప. ఇంతలో.. కళ్లు తెరిచిన కార్తీక్.. మోనిత అని పిలుస్తాడు. దాంతో గతం గుర్తొస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న దీపకు నిరాశగా చెంది బాధతో ఏడుస్తూ ఉంటుంది.
కారులో కార్తీక్ ని తీసుకు వెళ్తున్న మోనిత కారుకి దుర్గా డాష్ ఇస్తాడు. ఒక్కసారిగా దుర్గని చూసిన మోనిత షాక్ తింటుంది. అతనిని తప్పించుకొని స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది. దుర్గ మోనిత కారుని వెంబడిస్తాడు. మరోవైపు.. ఆటో వెనుక ‘అమ్మానాన్న ఎక్కడున్నారు’ అని రాసి ఉన్న అక్షరాలను తడుముతూ.. ‘ఇన్ని రోజులు మీరు బ్రతికే ఉన్నారనుకొని ధైర్యంగా ఉన్నానమ్మ. కానీ మోనిత ఆంటీ చెప్పిన తర్వాత మీరు లేరని తెలిసి భయమేస్తుంది’ అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది సౌర్య.
అనంతరం.. డాక్టర్ అన్నయ్య ఆసుపత్రిలో ఏడుస్తూ కూర్చున్న దీపకు ధైర్యం చెబుతాడు. మరో ప్రయత్నం చేద్దామని ప్రయత్నం, ఎప్పుడు ఆపవద్దని ఇంటికి తీసుకువస్తాడు. అక్కడ దీప బాధని చూసి చాలా బాధపడుతూ.. మోనితకి బుద్ధి చెప్పాలని డాక్టర్ తల్లి వెళ్లబోతుంది. దాంతో.. మనం అలా బలవంతంగా గుర్తు చేసే అవకాశం లేదు అమ్మ అంటూ ఆమెని పట్టుకొని ఏడుస్తుంది దీప. అప్పుడు ఆమె మోనితకి నీ భర్తని వదిలేయవద్దని, ఏ దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడో అని బాధపడుతూ చెబుతుంది. దాంతో ఈ ఎపిసోడ్ ఎండ్ కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. మోనిత కోసం ఆ ఏరియా అంతా వెతుకుతూ ఉంటాడు దుర్గ. అక్కడ దీప కనపడుతుంది. కార్తీక్ పిల్లల గురించి అడగ్గా జరిగిందంతా చెప్తుంది దీప. మోనిత ఇంటికి వెళ్లి షాక్ ఇస్తాడు దుర్గ. అసలేం జరిగిందో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.