Sri Satya: బిగ్ బాస్ హౌస్ లోఎంతో అట్రాక్టివ్ గా ఎంతో మందిని ఆకట్టుకుంటున్న వారిలో శ్రీ సత్య ఒకరు.ఈమె ఈ కార్యక్రమానికి రాకముందు పలు సినిమాలు సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి ఈమె తన ఫేవరెట్ హీరో రామ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈమె దేవదాసు సినిమా చూసినప్పటి నుంచి హీరో రామ్ కి అభిమానిగా మారిపోయిందట. ఈ క్రమంలోనే రామ్ నటించిన నేను శైలజ సినిమాలో చిన్న పాత్రలో చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇలా హీరో రామ్ అంటే తనకు ఎంతో ఇష్టమని నిజం చెప్పాలంటే పిచ్చి అంటూ ఈమె తన అభిమాన హీరో గురించి తెలిపారు.ఇకపోతే ఒకరోజు కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఆ రక్తం వేస్ట్ కావడం ఎందుకు అని భావించి ఈమె హీరో రామ్ పేరు రాసినట్లు తెలిపారు.
ఈ విధంగా రక్తంతో హీరో పేరు రాసి ఆ పేపర్లను భద్రంగా బీరువాలో పెట్టారట. అయితే ఒకరోజు తన తల్లి అది చూసి తనని చెడామడా తిట్టారని ఈమె తెలియజేశారు. అదేవిధంగా తన అన్నయ్యకు రాఖి కట్టడంతో తన అన్నయ్య నాకు గిఫ్ట్ గా రామ్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చారని, ఆ నెంబర్ ట్రూ కాలర్ లో జిమెయిల్ లో చెక్ చేసిన రామ్ నెంబర్ కావడంతో వెంటనే ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టినట్లు ఈమె తెలిపారు.
Sri Satya: ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసిన శ్రీ సత్య..
ఈ విధంగా ఈమె ఐ లవ్ యు అని పెట్టడంతో తాను తన మెసేజ్ చూసుకున్నారని అయితే తన నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టారని ఈ సందర్భంగా శ్రీ సత్య హీరో రామ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా రామ్ కోసం రక్తంతో లెటర్ రాసిన విషయాన్ని తెలియచేయడంతో ఎంతోమంది ఆశ్చర్యపోతూ శ్రీ సత్య తక్కువైంది కాదు ఈమెలో కూడా ఎన్నో కలలు దాగి ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.