ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి ఆరంభంలో మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. వాటి తర్వాత వచ్చిన సినిమాలు హ్యాట్రిక్ డిజాస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని కూడా నాగ చైతన్య జోడీగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీదనే పెట్టుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత ఉండటంతో మళ్ళీ తన రేంజ్ మారుతుందని భావిస్తుంది. ఇక తమిళంలో సూర్యకి జోడీగా ఒక సినిమాలో ఈ బ్యూటీ ఆడిపాడింది.
ఇదిలా ఉంటే వరుస ఉప్పెన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి కూడా నెక్స్ట్ హిట్స్ లేవు. తరువాత వచ్చిన కొండపాలం నటుడిగా అతని ఇమేజ్ ని పెంచిన కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన రంగరంగవైభవంగా సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో కథల ఎంపికపై వైష్ణవ్ శ్రద్ధ పెట్టాలనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కాంబినేషన్ లో సినిమా సెట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ కాంబో లో మరో లవ్ స్టోరీ మూవీ కన్ఫర్మ్ అయ్యిందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. ఉప్పెన సినిమాలో వీరిద్దరి జోడీగా మంచి హైప్ వచ్చింది. ఈ నేపధ్యంలో మరోసారి కృతి, వైష్ణవ్ అంటే సినిమాపై అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటుందని అనుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా బయటకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.