lose weight : మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. మారిన జీవిన విధానంతో చాలామంది ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువుతో ఉంటారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే వయసు మరియు ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో అంత మాత్రమే ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి కింద పేర్కొన్న మూడు టిప్స్ ని పాటించండి.
ఆహారంలో మార్పు:
మనం బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మనం బరువు పెరగడానికి కారణం ఏంటనే దానిపై ఆలోచన చేయాలి. అందులో భాగంగా కొవ్వును పెంచే లేదంటే కొవ్వు నిల్వ ఉండేలా చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి. రుచిగా ఉండటం కోసం మసలాలు, ఇతర దినుసులను అతిగా వాడకూడదని గుర్తించుకోండి. ఆహారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో తినాలని గుర్తించుకోండి.
శరీరానికి శ్రమ:
చాలామంది బరువు పెరగడానికి కారణం శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం. కాబట్టి బరువు తగ్గాలని అనుకున్న వారు ముందుగా వ్యాయామాలు చేయడానికి సిద్ధం కావాలి. ఒకేసారి భారీ వర్కవుట్ కాకపోయినా, కొద్దికొద్దిగా క్రమం తప్పకుండా వర్కవుట్ చేయాలని గుర్తితంచుకోవాలి. వర్కవుట్ కుదరకపోతే జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వాటిని కూడా చేయవచ్చు.
lose weight : నీటిని తాగడం, నిద్ర:
మనిషి ఆరోగ్యం మీద నిద్ర అనేది ఎంతో ప్రభావం చూపిస్తుంది. శరీరానికి తగినంత నీటిని అందించాలి. ఒకవేళ శరీరానికి తగినంత నీరు, నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు శరీర అవసరాలకు తగినట్లుగా నీటిని తాగడం మరియు నిద్రపోవడం లాంటివి చేయాలి.