సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లుకి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మల్లిక్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ ఈ సీక్వెల్ కి కథని అందించినట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో శ్రీలీలని హీరోయిన్ గా ఖరారు చేసి రెండు రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. అయితే ఈమె సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీంతో మళ్ళీ షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ గా కార్తికేయ 2 బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది.
ఆమె రెమ్యునరేషన్ పెంచిన అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యి తనని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా కోసం అనుపమ పేరే వినిపించింది. అయితే ఎందుకనో మళ్ళీ శ్రీలీల ఎంటర్ అయ్యింది. ఫైనల్ గా అనుపమ దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చి ఆగడం విశేషం. ఇక అనుపమ పరమేశ్వరన్ ఒకే చెప్పడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు షెడ్యూల్ వేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఖరారు చేసున్నారనే మాట వినిపిస్తుంది. ఈ సినిమాకి ఈ మల్లు బ్యూటీకి బాగానే జీతం ముట్టజెపుతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక్క సినిమాతో అనుపమ ఫేర్ అమాంతం మారిపోయింది. ఆమె ఇమేజ్ కూడా పెరిగిపోయింది అని చెప్పాలి. అలాగే మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. కోలీవుడ్ లో కూడా ఓ పెద్ద సినిమాలో అనుపమని మెయిన్ లీడ్ గా తీసుకోబోతున్నారని టెహ్లుస్తుంది.