BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ అసలైన ఆట మొదలైంది. స్టార్టింగ్ రెండు వారాల పాటు చప్పగా సాగిన బిగ్ బాస్ షో మూడో వారంలో కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక నాల్గవ వారంలో మరింత వినోదం పంచేందుకు బిగ్ బాస్ స్టార్టజీగా టాస్క్ లు ఇవ్వడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్కరూ తను నామినేషన్ అవ్వకూడదు ఎలాగైనా ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలి అనే ఆశతో గట్టిగానే ప్రదర్శన ఇస్తున్నారని చెప్పాలి.
ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో అడగు పెట్టిన చలాకి చంటి తనదైన ప్రదర్శన ఇవ్వాలనే చూస్తున్నాడు. కానీ ఎందుకో తెలియని భయంతో వెనకడుగు వేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో, టెలివిజన్ స్క్రీన్ మీద చంటి ప్రేక్షకులకు పంచుతున్న వినోదం బిగ్ బాస్ హౌస్ లో పంచలేకపోతున్నాడు. దీంతో బిగ్ బాస్ చలాకి చంటిలోని కమెడియన్ ను ఎలాగైనా బయటికి రప్పించాలనే ప్లాన్ వేశాడు.

ఇందులో భాగంగానే ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో చలాకి చంటికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పేరు హోటల్ వర్సెస్ హోటల్. అంటే రెండు హోటల్స్ సభ్యులుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విడిపోయి టాస్క్ ఆడాలి. ఇందులో చలాకి చంటి బిబి హోటల్ లో పని చేస్తున్నప్పటికీ లక్ష్యం మాత్రం బిబి హోటల్ నుంచి వీలైనంత ఎక్కువ మంది అతిథులను ఏ విధంగా అయినా సరే పారిపోయేలా చేసి మరో హోటల్ గ్లామ్ ప్యారడైజ్ కి పంపాల్సి ఉంటుంది.
ఈ సీక్రెట్ టాస్క్ ని విజయవంతగా పూర్తిచేసి హోటల్ గ్లామ్ ప్యారడైజ్ విజయం సాధించినట్లైతే వారితో పాటు నీవు కూడా కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తావని బిగ్ బాస్ చలాకి చంటికి అవకాశం ఇస్తాడు. ఒకవేళ ఈ సీక్రెట్ టాస్క్ లో పట్టుబడినా, ఈ టాస్క్ ని పూర్తి చేయడంలో విఫలమైనా కెప్టెన్సీ పోటీదారుడు అయ్యే అవకాశాన్ని కోల్పోతారని బిగ్ బాస్ చెబుతాడు. సో ఇప్పటి వరకు తనలోని కమెడియన్ ను ఇప్పటికైన చంటి బయటకు తీస్తాడా… బిగ్ బాస్ ఇచ్చిన ఈ సీక్రేట్ టాస్క్ ద్వారా తన ప్రదర్శన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి..!