Lakshmi Vasudevan: ఇంటర్నెట్ పుణ్యమా ఎన్ని లాభాలు ఉన్నాయో అనే నష్టాలు ఉన్నాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలామంది కాపురాలలో సోషల్ మీడియా చిచ్చు పెడుతూ ఉంది. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు టెక్నాలజీ పుణ్యమా వ్యక్తిగత సమాచారం ఫోటోలు… వీడియోలు లీక్ అయిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మరి దారుణంగా చెలరేగిపోతున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ రకంగానే తాజాగా ప్రముఖ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ సైబర్ నేరగాలకి చిక్కింది. ఆమె ప్రవేట్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఆమె ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో పెట్టడమే కాకుండా.. లోన్ తీసుకున్నారని ఆమెను వేధింపులకు గురి చేయడం జరిగింది.
తాజాగా ఈ విషయాన్ని లక్ష్మీ వాసుదేవన్ సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ…” అందరికీ నమస్కారం. నా వాట్సాప్ లో ఉన్న వారందరికీ ఈ మెసేజ్ ఇవ్వాలని అనిపించింది. నా ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేసి… నా కాంటాక్ట్స్ లో ఉన్నవాళ్లకు పంపుతూ ఉన్నారు. ఇది ఎక్కడ మొదలైందో నేను చెబుతాను. నాలా ఎవరూ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 11 వ తారీకు నాకు ఒక మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ లో నాకు ఐదు లక్షల రూపాయలు మనీ వచ్చినట్లు ఉంది. నేను ఆ లింకు క్లిక్ చేశాను. అప్పుడు ఒక యాప్ ఆటోమేటిక్ గా నా ఫోన్ లో డౌన్లోడ్ అయిపోయింది. ఆ యాప్ డౌన్లోడ్ అయిన కొద్దిసేపటికి నా ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజులకు నాకు కొన్ని మెసేజ్ లు రావడం స్టార్ట్ అయ్యాయి. మీరు లోన్ తీసుకున్నారు. ఐదువేల రూపాయల లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కట్టలేదు అంటూ… మెసేజ్ లు వచ్చాయి. మెసేజ్ లు రావడం మాత్రమే కాదు ఫోన్ కాల్స్, ఇంకా వాయిస్ మెసేజ్ లు రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా దారుణంగా తిడుతున్నారు.
5000 రూపాయలు వెంటనే కట్టకపోతే మీ మార్ఫింగ్ ఫోటోలు… అందరికీ పంపుదామని బెదిరిస్తున్నారు. దీంతో వెంటనే తేరుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే నా వాట్సాప్ కాంటాక్ట్ లో ఉన్న కొంతమందికి మార్నింగ్ ఫోటోలు వెళ్ళాయి. నా వెంట ఉన్న వాళ్ళందరికీ నేను ఎటువంటి దానినో తెలుసు. కానీ నా కుటుంబ సభ్యులకు ఫోటోలు వెళ్లిపోయాయి. తప్పుడు యాప్ డౌన్లోడ్ చేసి నేను అనుభవిస్తున్నాను. మీ ఫోన్ కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తే వాళ్ళు చెప్పేది నమ్మకండి. ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయకండి అంటూ… లక్ష్మీ వాసుదేవన్ తన బాధను తెలియజేసింది.