Foods For Lungs : శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగా ఎంతో ప్రత్యేక అవసరాన్ని తీరుస్తున్న అవయవం ఊపిరితిత్తులు. కీలకమైన శ్వాసక్రియకు ఊపిరితిత్తులు ఆధారంగా ఉంటున్నాయి. ఊపిరితిత్తులు బలంగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. కరోనా లాంటి వైరస్ లు ఊపిరితిత్తులను దెబ్బతీయడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయారనే విషయం తెలిసిందే.
ఊపిరితిత్తులు బలంగా ఉంటే శ్వాస వ్యవస్థ మీద ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. ఫలితంగా శరీరానికి మేలు కలుగుతుంది. మరి ఊపిరితిత్తులను బలంగా మార్చే ఆహారాలు ఏంటో, అవి ఊపిరితత్తులను బలపరచడంలో ఎలా కీలకంగా వ్యవహరిస్తాయో తెలుసుకోండి.
వెల్లుల్లి:
సగటు భారతీయ వంటల్లో మామూలుగా వాడే వెల్లుల్లి వల్ల ఊపిరితిత్తులు బలంగా మారతాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే కెమికల్ వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. దీంతో ఆస్తమా లాంటి ఊపిరితిత్తులు సంబంధింత అనారోగ్య సమస్యలు దరిచేరవు.
అల్లం:
మనం తరుచుగా వంటల్లో వాడే అల్లం కూడా ఊపిరితిత్తులను బలపరుస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అల్లం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు హాని కలిగించే శ్లేష్మం బయటకు వెళుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారతాయి.
పసుపు:
వంటల్లో వాడే పసుపు కూడా ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది. పసుపులో ఉండే కర్య్కుమిన్ అనే కెమికల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఊపిరితిత్తులు బలంగా తయారవడానికి సాయం చేస్తుంది.
దానిమ్మ:
దానిమ్మలోని ప్రత్యేక గుణాలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, శ్వాసకోశ పరిస్థితులను దూరం చేస్తుంది. కాబట్టి ఇది ఊపిరితిత్తులకి మేలు చేస్తుంది.
Foods For Lungs : ఆపిల్స్:
అనేక అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండటానికి ఆపిల్ తినమని డాక్టర్లు సలహా ఇస్తుండగా.. ఆపిల్ వల్ల ఊపిరితిత్తులకు మేలు కలుగుతుంది. ఆపిల్ తినే వారిలో ఊపిరితిత్తులకి వచ్చే క్రోనిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి రిస్క్ తగ్గుతుంది.