ఇండియన్ వైడ్ గా ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో స్పీడ్ గా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి రోజు సమంతకి సంబందించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి అరడజను వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో హాలీవుడ్ సినిమా కూడా ఒకటి ఉండటం విశేషం. అలాగే రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఖుషి మూవీ షూటింగ్ దశలో ఉండగా, హిందీలో ఒక సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.
అలాగే వెబ్ సిరీస్ కూడా రెడీ అవుతుంది. దానికోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. ఇవన్నీ ఉండగా మరో కొత్త ప్రాజెక్ట్ కి సమంత గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా సీతారామం సినిమాతో ఇండియన్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ త్వరలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కోటని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. అభిలాష్ జోష్ ఈ సినిమాకి దర్శకత్వంలో వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ మొదటి సారి ఈ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. మాస్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 28 నుంచి ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా సమంత నటిస్తుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఆమెని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు టాక్. అయితే ఆమె సినిమా కోసం ప్రత్యేకంగా కాల్ షీట్స్ కేటాయించినట్లు టాక్. ఇందులో సమంత పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని, అయితే చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కనిపించేది తక్కువ సేపే అయిన సమంత చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే.