తన నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని తల్లి అని కూడా చూడకుండా చంపే ప్రయత్నం చేస్తాడు మాధవ. మెట్ల మీది నుంచి పడడంతో తీవ్రగాయలపాలైన జానకిని అందరూ కలిసి ఆస్పత్రిలో చేరుస్తారు. అపుడే రాధ ఆదిత్యకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఆ తర్వాత దేవి దేవుడమ్మకు ఫోన్ చేసి జానకి గురించి తెలుపుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
స్పృహలోకి వచ్చిన జానకి మళ్లీ అంతలోనే స్పృహ కోల్పోతుంది. ఆ ఇళ్లు కట్టినప్పటి నుంచి ఎపుడూ ఏం జరగలేదని తలుచుకుంటూ బాధపడుతారు రాధ, రామ్మూర్తి. అంతలోనే భాగ్యమ్మ దేవి, చిన్మయిలను తీసుకుని ఆస్పత్రికి వస్తుంది. అవ్వ ఎలా ఉందో ఒకసారి చూస్తామంటూ అడుగుతారు రాధను. జానకి ఆరోగ్యపరిస్థితిని పిల్లలకి చెప్పి ఓదారుస్తాడు రామ్మూర్తి. బిడ్డలు రాత్రంతా నిద్ర కూడా పోలేదు పటేలా అని చెబుతుంది భాగ్యమ్మ. అంతలోనే దేవికి దేవుడమ్మ ఫోన్ చేస్తుంది. దేవి ఏడుస్తూ అవ్వ మెట్ల మీది నుంచి కింద పడిపోయిందని చెబుతుంది. ‘నేను ఆఫీసర్ సార్‌ని తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్న’ అని ఫోన్ కట్ చేస్తుంది దేవుడమ్మ. హాస్పిటల్లో ఉన్న రుక్మిణిని అమ్మ చూస్తే ఎలానని ఆందోళన చెందుతాడు ఆదిత్య.
భాగ్యమ్మ పిల్లల్ని ఇంటికి వెళ్దామని చెప్పగా.. వాళ్లు ఇప్పుడే రామంటూ మారాం చేస్తారు. దాంతో వంట చేసి క్యారేజ్ తీసుకొస్తానని చెప్పి భాగ్యమ్మ వెళ్తుంది ఇంటికి. అపుడే ఆదిత్య, దేవుడమ్మలు ఆసుపత్రికి వస్తారు. ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేయగా.. ఫోన్ కలవదు. దేవుడమ్మ రామ్మూర్తి వాళ్లని వెతుక్కుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. వాళ్లు రావడం గమనించిన చిన్మయి రాధతో దేవుడమ్మ అవ్వ వస్తుందని చెప్తుంది. అలా రాధ అత్త కంట్లో పడకుండా తప్పించుకుంటుంది. అపుడే రామ్మూర్తి కనిపిస్తాడు దేవుడమ్మకు. జానకి గురించి అడిగి తెలుసుకుంటుంది దేవుడమ్మ. డాక్టరు గారు వైద్యం చేస్తున్నారని, ఏం జరుగుతుందోనని బాధపడతాడు రామ్మూర్తి. హఠాత్తుగా అలా ఎలా జరిగిందని ఆరా తీస్తుంది దేవుడమ్మ. దేవి మాత్రం రాధ దగ్గరికి వచ్చి అవ్వ, ఆఫీసర్ సర్ వచ్చిండ్రు రా.. అమ్మ అంటూ పిలుస్తుంది. అపుడు తనని కవర్ చేస్తూ చిన్మయి మనం వెళ్దాం పద దేవి అంటూ తనని తీసుకెళ్తుంది.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్య చెప్పిన అబద్ధం గురించి తలుచుకుంటూ బాదపడుతుంది సత్య. తనని పట్టించుకోవట్లేదని మదనపడుతుంది. ఆదిత్యని ఇక్కడ ఉండనివ్వకూడదని అనుకుంటుంది. ఇలాగే వదిలేస్తే తన గురించి ఆలోచించకుండా దేవి గురించే ఆలోచిస్తాడని అనుకుంటుంది. పిల్లల గురించి ఆలోచించకపోవడం ఆదిత్య తప్పు కాదని.. చుట్టు పక్కల ఉన్న వాళ్ల తప్పని భావిస్తుంది. ఎలాగైనా ఆదిత్యని అక్కడి నుంచి తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతుంది. ఈసారి అమెరికా రానంటే తను ఒక్కతైనా వెళ్లాలనుకుంటుంది. పిల్లలు లేకపోవడం వల్లే ఆదిత్య దేవి చుట్టూ తిరుగుతున్నాడని, మాకే పిల్లలుంటే ఈ సమస్య ఉండేది కాదని, అందుకే ఒంటరిగానైనా అమెరికా వెళ్తాలనుకుంటుంది. అపుడే ఆదిత్యకు అక్క, దేవి మీద మనసు మళ్లకుండా ఉంటుందనుకుంటుంది లోపల.
మరోవైపు జానకికి ట్రీట్‌మెంట్ జరుగుతుంది. ఆదిత్యతో పాటు పిల్లలు, రామ్మూర్తి కూడా జానకిని చూసేందుకు వెళ్తారు. ‘ఏదో జరుగుతుందనుకుంటే ఇలా జరుగుతుందేంటి. ఒకవేళ అమ్మ కళ్లు తెరిచి నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి? రాధ నాకు దూరమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను’ అనుకుంటాడు మాధవ మనసులో. వెంటనే లోపలికి వెళ్తాడు. ‘జానకమ్మ కండీషన్ ఎలా ఉంది’ అని డాక్టర్‌ని అడుగుతాడు ఆదిత్య, దేవుడమ్మలు. అపుడు డాక్టర్ సారీ మేడం.. మెట్ల మీది నుంచి పడడం వల్ల నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఒత్తిడి వల్ల పక్షవాతం వచ్చిందని చెబుతాడు. దాంతో అందరూ కంటతడి పెడతాడు. మాధవ మాత్రం హ్యీపీగా ఫీలవుతాడు. రామ్మూర్తిని ఓదారుస్తారు ఆదిత్య, దేవుడమ్మలు. ఎంత ట్రీట్‌మెంట్ ఇచ్చినా పరిస్థితి మెరుగుపడదని చెబుతాడు డాక్టర్. అవ్వ ఇక నడవదా? అంటూ ఏడుస్తారు పిల్లలిద్దరూ. ఏం కాదని పిల్లల్ని ఓదారుస్తాడు ఆదిత్య. మరి మాధవ్, రాధల మధ్య ఇంకేం యుద్ధం జరుగుతుందో చూడాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..