Sharukh Khan: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ జీరో సినిమా ద్వారా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో సందడి చేయలేకపోయింది. తద్వార అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ తన తదుపరి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం పఠాన్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇక ఈ సినిమా నుంచి తాజాగా షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరాల్ గా మారింది. పొడవాటి జుట్టు కలిగి కేవలం జీన్స్ ధరించే సోఫాలో కూర్చున్నటువంటి షారుఖ్ ఖాన్ లుక్ కిసంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ ను షారుఖ్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు.
ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనేతో కలిసి ఈయన నాలుగోసారి సందడి చేయబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి హీట్ అందుకున్నాయి.
Sharukh Khan: కిల్లింగ్ లుక్ లో షారుఖ్..
ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషలలో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార నటిస్తున్నారు.