Kajal Agarwal: వెండితెర చందమామగా తన అందంతో అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న నటి కాజల్ అగర్వాల్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా సౌత్ టూ నార్త్ అగ్రతారగా గత దశాబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాజాల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ కావడంతో ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇన్ని రోజులపాటు తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదించిన ఈ చందమామ త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ వెండి తెరపై సందడి చేయడం కోసం కావాల్సిన కసరత్తులను చేస్తున్నారు.సాధారణంగా ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే కాజాల అగర్వాల్ శరీరాకృతిలో పెద్ద ఎత్తున మార్పులు రావడమే కాకుండా ఆమె కాస్త బొద్దుగా తయారవడంతో ప్రస్తుతం తన ఫిట్ నేస్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె ఎన్నో కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తోంది.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం గుర్రపు స్వారీ చేస్తూ సందడి చేస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాజల్ అగర్వాల్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
Kajal Agarwal: ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి కాజల్..
ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి షూటింగ్ పనులను ప్రారంభించుకుంటున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ సైతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున కసరత్తులు మొదలుపెట్టి మునుపటిలా తన ఫిట్నెస్ పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటి కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ ప్రీతిసింగ్ కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. భారతీయుడు సినిమాతో హిట్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.