Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్, తులసిలు ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. ప్రెస్ వాళ్లు సామ్రాట్ తో మీరు ఇంతకుముందు బిజినెస్ స్కూల్ పార్టనర్ షిప్ నుండి తప్పుకున్నారు కదా. మళ్లీ పార్ట్నర్షిప్ కోసం ఏం చేసి తులసి గారిని ఒప్పించారు అని అడుగుతారు. ఇంకో అతను తులసి గారికి చదువు రాదు కదా అంత పెద్ద మేనేజర్ పోస్ట్ లో పెట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సామ్రాట్ ఎందుకు ఇలాంటి ఆధారాలు లేని ప్రశ్నలు అడుగుతున్నారు అంటే ప్రెస్ వాళ్ళు నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటారు. సామ్రాట్ అలాంటిదేమీ లేదు అంటుండగా ప్రెస్ వాళ్లు మేము కావాలని అడగడం లేదు బయట అనుకునే విషయాన్ని ఇక్కడ మేము అడుగుతున్నాము అంటారు. బయట మీ గురించి ఒకరినొకరు ఇష్టపడ్డారు త్వరలోనే ఒకటి కాబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నిస్తారు. ఇంకొక ప్రెస్ వ్యక్తి మీ బిజినెస్ పార్టనర్ ను లైఫ్ పార్ట్ చేసుకుంటున్నారు మరి మీ వైఫ్ సంగతేంటి అంటారు. తులసి కోపంగా మీడియా వాళ్లతో ఒక ఆడది ఎవరితో మాట్లాడిన తప్పే అంటారా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా ఆడదానిని ఎదగనివ్వకుండా ఇలాంటి ప్రశ్నలతో వంటగదికే పరిమితం చేస్తారా అంటుంది. సామ్రాట్ గారు కేవలం బిజినెస్ పార్టనర్ మాత్రమే మా మధ్య ఏ ఇతర సంబంధం లేదు. మీలో కూడా ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు ఉన్నారు మీ ఇండ్లలో కూడా ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలను వాళ్లను అడిగితే ఆ బాధ ఏంటో తెలుస్తుంది మౌనంగా ఉంటే రకరకాలుగా అనుకుంటారు.
మీరు రాసే రాతలపై ఒక ఆడదాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని గట్టిగా సమాధానం చెబుతుంది. ఇంకా ఎవరో సామ్రాట్ గారి భార్య గురించి అడిగారు అది ఆయన వ్యక్తిగత విషయం అందులోకి కూడా తొంగి చూసి మరి ప్రశ్నలు అడగాలా కనీసం మీకు సిగ్గు అనిపించడం లేదా ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అంటే ప్రెస్ వాళ్ళు క్షమించండి మేడం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సామ్రాట్, తులసి తో నేను మీకు తోడుగా ఉందామనుకున్నాను కానీ మీరే నాకు తోడుగా ఉన్నారు అంటూ అభినందిస్తాడు.
తరువాత సన్నివేశంలో తులసిని కుటుంబ సభ్యులు పొగిడితే, అభి మాత్రం నువ్వు ఒక్కదానివే మాట్లాడావు సామ్రాట్ గారు మాట్లాడలేదు అలాంటి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది. ఇలా మౌనంగా ఉంటే అర్థం ఏంటి ఇలాంటి వ్యక్తితో ఇంకా సమస్యలు పెరుగుతాయి అంటే తులసి కూడా ఇప్పుడే కదా బిజినెస్ పార్టనర్ అయ్యాము కాస్త నెమ్మదిగా ఆయన మనసులో మాట చెప్తాడు. ఆయన మౌనానికి ఏదైనా బలమైన కారణం ఉండవచ్చు. ఇప్పుడే అన్ని విషయాలు తెలుసుకోవాలంటే కష్టం అంటుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో సామ్రాట్ నిద్రపోతున్న అని వద్ద కూర్చొని బాధపడుతూ మనసులో నేను మీ నాన్నను కాదు నన్ను క్షమించు అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.