BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ముచ్చటగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వారంలో షానీ, అభినయ ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారంలో జరిగిన నామినేషన్స్ లో ఉన్న నేహా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారు అనేది సోమవారం తెలుస్తుంది. ఇక లాస్ట్ వీక్ లో నామినేషన్స్ లో ఉన్న బాలాదిత్య ఇప్పట్లో ఎలిమినేషన్ అవడం కష్టమే అని చెప్పవచ్చు.
మూడు వారాల పాటు సాగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో బాలాదిత్య తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొదటి రెండు వారాలు మరీ ఎక్కువగా కంటెంట్ ఇచ్చాడు బాలాదిత్య. రెండో వారం చివర్లో తన మంచితనమే తనకు చెడుగా మారడంతో కాస్త డీలా పడ్డాడు. అందులోనూ నాగార్జున కూడా ప్రదర్శన తీరు పట్ల కాస్త నెగిటీవ్ ఫీడ్ ఇచ్చాడు.

దీనికి తోడు తోటి కంటెస్టెంట్స్ బాలాదిత్య సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి అది నా ఆట తీరు కాదు.. నా తీరే ఇంత అని హౌస్ లో తన వ్యక్తిత్వం గురించి బాలాదిత్య కంటెస్టెంట్స్ కి వివరించాడు. అయినప్పటికీ ఎక్కడో తేడా కొట్టినట్లు అనిపించిన ఆదిత్య మూడో వారం మాత్రం కాస్త తక్కువ ప్రదర్శన చూపించాడు. దీంతో నాగార్జున వీడియో చూపించి మరీ ఎందుకు ఆట ఆడటం లేదని ప్రశ్నించాడు.
ఆదివారం ఎపిసోడ్ లో మాత్రం నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టాడు బాలాదిత్య. అదేంటంటే ఓ గేమ్ లో భాగంగా తన ప్రదర్శనను నిరూపించుకున్నాడు. ఓ సీనియన్ కమెడియన్ ఎవరు అనేది నటించి చూపించి కంటెస్టెంట్స్ ద్వారా ఆ కమెడియన్ పేరు ఏంటనేది చెప్పించాలి. చాలా సీనియర్ కమెడియన్ రాజనాల పేరును కంటెస్టెంట్స్ చెప్పేలా బాలాదిత్య ప్రదర్శన చూపించారంటే మీ ఊహించుకోండి. ఈ గేమ్ ఆడేటప్పుడు నీవు చెప్పగలవు అని నాగార్జున అన్నట్లుగానే బాలాదిత్య చెబుతాడు. నాగార్జున నమ్మకాన్ని మొత్తానికి బాలాదిత్య నిలబెట్టాడు.