సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూతురు పుట్టాక మళ్ళీ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. అలాగే మునుపటి బాడీ, లుక్ తిరిగి తెచ్చుకోవడానికి గట్టిగా శ్రమిస్తుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ని శంకర్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభించాడు. ఇక ఇందులో కాజల్ అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందనే మాట వినిపిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న లేడీగా ఆమె కనిపించబోతుంది.
అయితే ఈ మధ్య ఆమె గుర్రపు స్వారీతో పాటు ప్రాచీన యుద్ధ విద్యలలో ఒకటైన కత్తియుద్ధం నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. భారతీయుడు రాచరికానికి చెందిన సినిమా కాదు. కాబట్టి యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాని యుద్ధ విద్యలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది అంటే దాని వెనుక వేరే కారణం ఉందనే మాట వినిపిస్తుంది. ఆమె పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 లో నటించబోతుందనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అందుకోసమే ఆమె యుద్ధ విధ్యాలని ప్రత్యేకంగా నేర్చుకుంటుంది అని టాక్.
పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత పార్ట్ 2 కూడాత్వరలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమా కోసమే ఈ యుద్ధ విధ్యాలపై కాజల్ అగర్వాల్ శ్రద్ధ అనే మాట గట్టిగా వినిపిస్తుంది. అలాగే సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో కూడా ఆమె ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే ఓ చారిత్రాత్మక కథ ఆధారంగా తెరకెక్కబోయే వెబ్ సిరీస్ కోసం కాజల్ అగర్వాల్ ఇలా ప్రాచీన యుద్ధ విధ్యాలని నేర్చుకుంటుంది అనే టాక్ కూడా నడుస్తుంది.