AP Schools: ఏపీ ప్రభుత్వానికి లేని చిక్కులు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో హడావిడి చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాల విషయంలో మాత్రం నిరుత్సాహం వస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ విషయంలో కూడా జగన్ సర్కారుకు మింగుడుపడని విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్కూల్స్ రూపు రేఖలు మార్చినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని తెలుస్తోంది.
ప్రభుత్వ స్కూల్స్ కు కోట్ల రూపాయలు కేటాయించి, వాటిని పూర్తిగా మార్చి వేసినా కానీ ఫలితాల విషయంలో వెనకబడటం తెలిసిందే. ప్రభుత్వ స్కూల్స్ అనుకున్న స్థాయిలో ఫలితాలు తేలేకపోయాయి. అటు ఏపీలో చాలా ప్రభుత్వ స్కూల్స్ ని విలీనం చేశారు. దీంతో రాష్ట్రంలో వందల సంఖ్యలో స్కూల్స్ మూతబడ్డాయి.
అయితే స్కూల్స్ మూత బడినా కానీ విద్యార్థుల సంఖ్య మాత్రం బాగా పెరిగిందని ప్రభుత్వం చెప్పింది. కానీ లెక్కల్లో చూస్తే మాత్రం అదంతా ఏమీ లేదని తేలింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య 4లక్షలు తగ్గిందనే సమాచారం. ఫలితాల్లో సత్తా చాటకపోవడం, విలీనం పేరుతో స్కూల్స్ మూసివేయడం, స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి.
AP Schools:
మరో పక్క జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాలను ప్రారంభించింది. కానీ ఇంగ్లీష్ మీడియా స్కూల్స్ లో బోధించే సత్తా ఉన్న టీచర్లు మాత్రం లేరట. అద్భుతంగా ఇంగ్లీష్ లో బోధించగల సామర్థ్యం ఉన్న టీచర్ల సంఖ్య తక్కువగా ఉండటమే సమస్యగా మారింది. దీంతో ఈ ఏడాది కూడా ఫలితాల మీద ప్రభావం పడుతుందని, గతేడాది కరోనాను కారణంగా చూపించినా, ఈ ఏడాది ఎలా అనే ప్రశ్న ప్రభుత్వానికి ఎదురవుతోంది.