Mehreen : తెర మీద కనిపించే ముద్దుగుమ్మలు అందంగా కనిపించేందుకు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. తమ లుక్స్ పైన స్పెషల్ కేర్ తీసుకుని తమ లక్ ని పరీక్షించుకుంటారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్ లను వితౌట్ మేకప్ చూసింది చాలా అరుదనే చెప్పాలి. తారలు వెకేషన్ కి వెళ్ళినా కెమెరా కళ్ళకు చిక్కినా మేకప్ తోనే కనిపిస్తుంటారు. మేకప్ తీసేస్తే వారి అసలు మొహం గుర్తుపట్టడం కష్టమని చాలామంది భావిస్తుంటారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని రుజువు చేసింది f3 హీరోయిన్ మెహరీన్. తెల్లటి మేని ఛాయను కలిగిన ఈ భామ మేకప్ లేకుండా చందమామలా తల తలా మెరిసిపోతోంది.

Mehreen : ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా మీద కాన్సెంట్రేట్ చేసింది మెహ్రిన్. ఎప్పటికప్పుడు తాజా ఫోటోషూట్ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది బ్యూటీ. మూవీస్ సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ వెకేషన్ టూర్ కి సంబంధించిన పిక్స్ ను కూడా పోస్ట్ చేసి ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. వెల్వెట్ కలర్ గౌన్ వేసుకుని వితౌట్ మేకప్ దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విత్ మేకప్ ఏ కాదు వితౌట్ కూడా నేను అందగత్తెనే అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి నాచురల్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్స్ కింద నో మేకప్ అన్ని క్యాప్షన్ను జోడించింది మెహరీన్ .

వెంకటేష్, వరుణ్, తమన్న, మెహ్రీన్ కలసి నటించిన ఎఫ్ త్రీ అవేరేజ్ గా హిట్ కావడంతో ఇటీవలె వెకేషన్ కోసం ఈ భామ పారిస్ , ఇటలీకి వెళ్ళింది. అక్కడ పారిస్ వీధుల్లో, బీచ్ లో హాయిగా విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పూల అలంకరణలతో డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ని ధరించి అందరి చూపులు తనువైపు తిప్పుకుంది.

అంతకుముందు సముద్రంలో షిప్ లో విహరించిన మెహ్రీన్ కలర్ ఫుల్ బికినీలో కత్తిలా కనిపించింది. డార్క్ బ్లూ కలర్ లో వివిధ డిజైన్స్ తో వచ్చిన ఈ బికినీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ ఇది నీ బెస్ట్ పిక్ అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం మెహ్రీన్ కు తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. ఈ అమ్మడి కన్సెంట్రేషన్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై పడింది . తమిళంతోపాటు కన్నడలో మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది . ఏదిఏమైనా ఈ పాల బుగ్గల సుందరి వితౌట్ మేకప్ లో ఉన్న చందమామల మెరిసిపోతుంది.
