ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్ఠీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుందనే మాట వినిపిస్తుంది. క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో కొరటాల శివ దృష్టిపెట్టాడని తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ ని ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారు. అయితే ఈ మూవీపై తాజాగా ఆసక్తికరమైన టాక్ బయటకొచ్చింది. కొరటాల శివతో తారక్ చేయబోయే సినిమా ఆగిపోయిందనే మాట బలంగా వినిపిస్తుంది. స్క్రిప్ట్ విషయంలో తారక్ సంతృప్తిగా లేకపోవడంతో పాటు యూనివర్శల్ అప్పీల్ కథలో లేదని కొరటాల సినిమాని తారక్ పక్కన పెట్టాడని చెప్పుకుంటున్నారు.
దీని స్థానంలో బుచ్చిబాబు దర్శకత్వంలో 30వ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయ్యిందని, యూనివర్శల్ లెవల్ లో పాన్ ఇండియా అప్పీల్ బుచ్చిబాబు కథకి ఉండటంతో తారక్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ కి రెడీ అవ్వమని చెప్పినట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. కొరటాలకి స్క్రిప్ట్ ని మరింత బెటర్ గా డెవలప్ చేయమని తారక్ సూచించాడని, బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వీలునిబట్టి చేద్దామని సున్నితంగా చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో తారక్ హామీ ఇవ్వడంతో బుచ్చిబాబు ఇక ఈ మూవీపై దృష్టిపెట్టి పూర్తిస్థాయిలో నేరేషన్ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే ఈ వార్తలలో వాస్తవం లేదని ఇప్పటికే కొరటాల సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని, నవంబర్ మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్తుందనే మాట మరో వైపు వినిపిస్తుంది. ఇక హీరోయిన్ కూడా ఖరారైపోయిందని మృణాల్ ఠాకూర్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారని అధికారికంగా ఎనౌన్స్ చేయడమే మిగిలి ఉందని చెప్పుకుంటున్నారు. మరి వీటిలో ఏది వాస్తవం అనేది అఫీషియల్ గా ఏదో ఒక సినిమా అప్డేట్ బయటకి వచ్చే వరకు తెలియదు.