Ravindar: ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రతి విషయం కొన్ని నిమిషాలలోనే వైరల్ గా మారుతుంది. అయితే ఇటీవల సోషల్ మీడియా స్టార్ కపుల్ గా గుర్తింపు పొందిన ఈ తమిళ జంట కి సంబంధించిన ఒక వార్త మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి మహాలక్ష్మి ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. అయితే వీరిద్దరూ ఇలా వివాహం చేసుకోవడం వల్ల వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీరు ఇలా పాపులర్ అవటానికి ముఖ్య కారణం వారు ఇరువురు కూడా మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని రెండవ వివాహం చేసుకోవడమే.రవీందర్ మహాలక్ష్మి జంట ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటయింది. అప్పటినుండి వీరి పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ రవీందర్ గురించి బాడీ షేమింగ్ చేస్తూ.. వీరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం ఈ ట్రోలింగ్స్ గురించి పట్టించుకోకుండా వారి వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
ఇక ప్రస్తుతం వీరిద్దరూ కూడా హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరికి సంబందించిన మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన రవీందర్ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఆమెకు ఎన్నో విలువైన కానుకలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Ravindar: భార్యకు భారీగా ఖర్చుపెట్టిన ప్రొడ్యూసర్ రవీందర్
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి సమయంలో రవీందర్ ఒక బంగారు పూత పూసిన మంచాన్ని మహాలక్ష్మికి కానుకగా ఇవ్వటమే కాకుండా మరిన్ని విలువైన బహుమతులు ఆమెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు మహాలక్ష్మికి చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్… అంత భారీ శరీరాన్ని ఆమె పెళ్ళి చేసుకోవాలంటే ఆ మాత్రం కానుకలు ఇవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.