త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఫ్యామిలీఎంటర్టైనర్ చిత్రాలు గుర్తుకొస్తాయి. క్లాసిక్ హిట్స్ గా అతని సినిమాలు ఉంటాయి. హీరో పాత్ర కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. పేదవాడైన కూడా హీరో స్టైలిష్ గానే ఉంటాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ జాబితాలో జూనియర్ ఎన్టీఅర్ తో పాటు అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. సలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేస్తాడు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 మూవీపై ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత మరే దర్శకుడు కూడా అతని జాబితాలో లేరు. చందూ మొండేటితో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అయితే చందూ ప్రస్తుతం కార్తికేయ3పై శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత కొంత గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్ హరికహాసిని ప్రొడక్షన్ లోనే తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.