Vijayshanthi: హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రంగంలో అప్పట్లో హీరోలకే పోటీ ఇచ్చి లేడీస్ సూపర్ స్టార్ గా.. టైటిల్ సొంతం చేసుకోంది. 90లలో గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఇంకా ప్రజాసేవపైనే దృష్టి పెట్టడం జరిగింది. కానీ 2020వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు”తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు చాలా వస్తున్నాగాని పాత్ర ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడానికే ఇష్టపడుతూ ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది.
ఇదిలా ఉంటే ఒకప్పుడు తన తోటి హీరోలు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్స్ హీరోగా పిలవబడుతున్న వాళ్లను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ టైములో అప్పటి హీరోల అందరిని దొంగలుగా తేల్చి చెప్పింది. పూర్తి విషయంలోకి వెళ్తే ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీ బ్యాచ్ హీరోల గురించి చెప్పండి అంటూ విజయశాంతిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రాములమ్మ సమాధానం చెబుతున్న బ్యాచ్ హీరోలంతా ముసుగు వేసుకున్న దొంగలు. వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ లో కనీసం 20 శాతం కూడా ప్రజలకు ఖర్చు చేయలేదు. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు కానీ బయట కాదు అంటూ కామెంట్లు చేసింది. రాజకీయాల్లో ఉన్న తనకు ప్రజలలోకి పిలిచి దండేసి అభినందిద్దాం అని అనుకున్న ఒక హీరో కూడా అప్పట్లో కనిపించలేదు అని తెలిపింది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న సపోర్ట్ చేయండి అంటే ఎవరు కూడా… ముందుకు రాలేదు అని తెలిపింది. ఇదే సమయంలో తాను కావాలనుకుంటే కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉంది. నాకు అన్నిటికంటే ముఖ్యం ప్రజాసేవ చేయడమే. కష్టపడి సాధించిన దానితోనే ఎప్పుడూ కూడా నేను సంతోషంగా ఉంటాను. జనాల కోసం కష్టం అనుభవించడానికి ఎప్పుడు కూడా ముందుంటాను. ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తాను. సినిమా నచ్చితేనే ఒప్పుకోవటం జరుగుతుంది. అసలు సినిమాలపైనే ఇంట్రెస్ట్ లేదు. నా ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే ఉంది అంటూ విజయశాంతి ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం జరిగింది.