Ram Charan: మెగా అభిమానులు ఎప్పటినుండో మెగా వారసుడు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. చరణ్- ఉపాసనకి పెళ్లయ్యి పది సంవత్సరాలు కావస్తున్నా గాని ఇప్పటికీ పిల్లలు కలగలేదు. మరోపక్క కెరియర్ పరంగా చరణ్ తండ్రికి తగ్గ తనయుడు మాదిరిగా దూసుకుపోతున్నారు. “RRR”తో .. ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. రామరాజు పాత్రలో శరణ్ నటన అద్భుతంగా ఉండటంతో బాలీవుడ్ సైతం పొగడ్తలతో ముంచెత్తింది. “జంజీర్” టైంలో.. ఎగతాళి చేసిన బాలీవుడ్ మీడియా “RRR” తర్వాత చరణ్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉంది.
ఇటువంటి తరుణంలో అన్ని రకాలుగా జీవితం సాఫీగా సాగుతూ ఉండటంతో కొద్దిరోజుల క్రితం చరణ్, ఉపాసన కలసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు. కాగా బుధవారం రాంచరణ్ దంపతులు హైదరాబాద్ కి చేరుకున్నారు. అప్పటినుండి రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతూ ఉంది. ఎప్పటినుండో ఈ శుభ ఘడియల కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. మరోపక్క ఉపాసన కూడా చాలా సందర్భాలలో పిల్లలకు సంబంధించి అనేక ప్రశ్నలు పలు ఇంటర్వ్యూలలో ఎదుర్కోవటం జరిగింది. అది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటూ కూడా గట్టిగానే ఘటుగా ఒకానొక టైంలో స్పందించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ క్రమంలో చరణ్ తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్త అభిమానులలో పండుగ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంది. మరోపక్క మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “RC 15” వర్కింగ్ టైటిల్ కలిగిన సినిమా చరణ్ చేస్తూ ఉన్నాడు. ఇండస్ట్రీలో మొన్న షూటింగ్స్ బంద్ అవటంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే మళ్లీ స్టార్ట్ చేయనున్నారు. మధ్యలో గ్యాప్ రావడంతో శంకర్ అటు కమలహాసన్ “ఇండియన్ 2” కంప్లీట్ చేయటానికి రెడీ అవటంతో చరణ్ భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.