Bigg Boss6: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఈ కార్యక్రమం పలు భాషలలో ప్రసారమౌతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారం కాగా ఇప్పటికే రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారం కొనసాగుతోంది.
ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇప్పటికే బిగ్ బాస్ ఎన్నో టాస్కులను నిర్వహించారు. అయితే ఈ టాస్కులు మొత్తం నువ్వా నేనా అన్నట్టుగా కంటెస్టెంట్లు పోటీపడ్డారు.ఇకపోతే మొదటివారం బాలాదిత్య రెండవ వారం రాజశేఖర్ కెప్టెన్ గా వ్యవహరించగా మూడవ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా విడుదల చేసిన ప్రోమో ద్వారా ఈ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎత్తర జెండా అనే టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.
ఈ టాస్క్ లో శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి పాటిస్పేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇసుక తీసుకెళ్లి బిగ్ బాస్ తమకి ఇచ్చిన బాక్సులో వేయాలి. ఈ క్రమంలోనే ఈ టాస్క్ పూర్తయ్యేలోగా ఆదిరెడ్డి విజేతగా నిలిచినట్టు తెలుస్తుంది. ఈ టాస్క్ పూర్తి కాగానే ఆదిరెడ్డి కుర్చీలో కూర్చుని ఎంతో ఎమోషనల్ అవుతున్నట్టు చూపించారు. తద్వారా ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించిన ఆదిరెడ్డి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.
Bigg Boss6: కెప్టెన్ గా కామన్ మ్యాన్…
ఇక ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇద్దరి కంటెస్టెంట్లను బిగ్ బాస్ నుంచి బయటకు పంపారు. మొదటివారం ఎలిమినేషన్ లేకపోయినా రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. శనివారం షానీ ఇంటి నుంచి బయటకు వెళ్లగా ఆదివారం అభినయశ్రీ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు వేసి చూడాలి.