Allu Sirish: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం పెద్దగా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయారు. ఈయనకి ప్రొడ్యూసర్ అయిన తండ్రి పాన్ ఇండియా స్టార్ హీరో అయిన అన్నయ్య ఉన్నప్పటికీ ఇతనికి మాత్రం ఎలాంటి లక్ కలిసి రాలేదని చెప్పాలి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన అల్లు శిరీష్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో బిజీ కాలేకపోయారు.
ఇకపోతే అల్లు శిరీష చివరిగా ఏబిసిడి అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా విడుదల అయ్యి చాలా కాలం అయింది.ఇలా చాలా సంవత్సరాల నుంచి అల్లు శిరీష్ సినిమాల గురించి ఏ విధమైనటువంటి ప్రస్తావన రాకపోవడంతో ఈయన పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారని అందరూ భావించారు. అయితే ఒకానొక సమయంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో కలిసి ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏంటి అనే విషయం ఎవరికీ తెలియదు.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు శిరీష్ నటించిన ఓ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ పోస్టర్ విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నేటిజన్స్ ఆలోచనలో పడ్డారు.
Allu Sirish: కొత్తగా టైటిల్ ఫిక్స్ చేయడం ఏంటి
అల్లు శిరీష్ నటిస్తున్నటువంటి ప్రేమ కాదంట సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు అయితే కొత్తగా మరోసారి టైటిల్ అనౌన్స్ చేయడం ఏంటి అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు శిరీష్, అను నటిస్తున్నటువంటి సినిమాకే మరికొంత కలరింగ్ ఇస్తూ విడుదల చేయబోతున్నారా లేదంటే అల్లు శిరీష్ కొత్త సినిమా చేశారా అనే విషయంలో సందేహాలు వెలబడుతున్నాయి.అయితే ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేవరకు వేచి చూడాలి.