Ranbir Kapoor -Aliya Bhat: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
ఇలా ఈ సినిమా మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ క్రమక్రమంగా ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో భారీ వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా మూడు భాగాలుగా ఉండబోతుందని తాజాగా రణబీర్ కపూర్ ఓ సందర్భంలో వెల్లడించారు.ఇకపోతే ఈ సినిమా కోసం నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్ర సినిమా కోసం నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై రణబీర్ కపూర్ స్పందిస్తూ తాను ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవలేదని అయితే ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించానని తెలిపారు. ఇక అలియా భట్ సైతం ఈ సినిమాలో రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు.
Ranbir Kapoor -Aliya Bhat: రెమ్యూనరేషన్ లేకుండా నటించిన రణబీర్ అలియా..
అలియా భట్ ఈ సినిమా కోసం 2014 వ సంవత్సరంలోనే కమిట్ అయ్యారు. అయితే అప్పటికి ఇంకా ఆమె స్టార్ హీరోయిన్ కాకపోయినప్పటికీ ఆమె కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఇస్తామని చెప్పినప్పటికీ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆలియా భట్ ఈ సినిమాలో నటించారని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ ఎన్నో విషయాలను త్యాగం చేశారని నిజం చెప్పాలంటే ఆయన లేకపోతే బ్రహ్మాస్త్ర సినిమా పూర్తి కాదంటూ ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.