NTR: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. టీడీపీ మహానాడుతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి చాలాసార్లు కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జరుగుతున్న దుమారంతో ఎన్టీఆర్ భారతరత్న అంశంపై మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీప పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీాగా మార్చడాన్ని అధికార వైసీపీలోని కొంతమంది నేతలతో పాటు ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ దీనిన వ్యతిరేకిస్తున్నాయి. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రకటనలు విడుదల చేశారు. జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రతి పార్టీ ఎన్టీఆర్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ ను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. కానీ బీజేపీ నేతల తీరు మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎవరూ ఏం అనుకోరారు., కానీ సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, విష్ణుకుమార్ లాంటి నేతలు కూడా ఎన్టీఆర్ పై ప్రేమను ఓలకబోస్తున్నారు.
NTR:
ఎన్టీఆర్ పై తన ప్రేమను చాటుకున్న బీజపీ నేతలు… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతుననాయి. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందిగా కేంద్రంలోని మత ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదనే ప్రశ్ంనలు ఉత్పన్నమవుతున్నాయి. మోదీపై ఒత్తిడి తీసకొచ్చి ఎన్టీఆర్ కు భారతరత్న ఎందకు ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు రాష్ట్ర బీజేపీ నేతలపై వస్తున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్టీఆర్ పై ప్రేమ చూపిస్తున్నారు తప్ప… వారికి నిజంగా ఎన్టీఆర్ ప్రేమ లేదని ఆరోపణలు వస్తున్నాయి.