డీసెంట్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ హీరో నాగశౌర్య. అతని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి. అతని నటన కూడా మరి ఓవర్ గా కాకుండా సెటిల్డ్ గా ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసుకుంటే అతనికి తిరుగు ఉండదని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. నాగశౌర్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం మాత్రం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చలో సినిమా అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత కాస్తా కొత్తగా ట్రై చేసి తనని తాను కమర్షియల్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం నాగశౌర్య చేశాడు. ఆ సినిమాలు ఏవీ కూడా అతనికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. మరల క్రిష్ణవ్రిందావిహారి అంటూ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా భాగానే ఆకట్టుకుంది.
అయితే ఇప్పటికే నాని ఇలాంటి కథతోనే అంటే సుందరానికి అనే సినిమాతో వచ్చి ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపధ్యంలో ఇంచుమించు అలాంటి కథతోనే నాగ శౌర్య కూడా ప్రేక్షకుల ముందుకి క్రిష్ణవ్రిందవిహారి సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఆర్ధోడెక్స్ ఫ్యామిలీలో పుట్టి తల్లిపెట్టే కట్టుబాట్లు మధ్య పెరిగిన కృష్ణమాచారి సిటీలో పెరిగిన మోడరన్ అమ్మాయి అయిన వ్రిందాతో ప్రేమలో పడతాడు. అయితే సంప్రదాయాలని ఫాలో అయ్యే తల్లి, మోడరన్ లైఫ్ కోరుకునే ప్రియురాలి మధ్యలో కృష్ణమాచారి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే లైన్ తో ఈ సినిమా కథ ఉంటుంది.
కృష్ణమాచారి పాత్రలో నాగ శౌర్య తనకి అలవాటైన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో పాటు కామెడీని కూడాబాగానే పండించాడు. అలాగే హీరోయిన్ షెర్లీ సేథియా మొదటి సినిమాతోనే తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కథ, అందులో కామెడీ పరంగా సినిమా ఆద్యంతం నవ్విస్తుంది. అయితే హీరో, హీరోయిన్స్ మాత్రమే లవ్ ట్రాక్స్, ఆఫీస్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు రొటీన్ గానే ప్రేక్షకుడి అంచనాకి అనుగుణంగానే ఉంటాయి. అయితే కంటెంట్ పరంగా నిడివి తక్కువ ఉండటంతో పెద్దగా బోర్ కొట్టకుండానే దర్శకుడు కథనం నడిపించాడు. ఇక సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రెండు సాంగ్స్ బాగున్నాయి. ట్విట్టర్ లో కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి. చలో సినిమా తర్వాత నాగ శౌర్య నుంచి వచ్చిన మంచి ఎంటర్టైనర్ గా ఈ మూవీ నిలుస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమాతో నాగ శౌర్య హిట్ టాక్ ని అందుకున్నాడు. అయితే వీకెండ్ తర్వాత ఏ స్థాయిలో ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తాడు అనేది సినిమా లాంగ్ రన్ లో ఏ స్థాయిలో కలెక్ట్ చేస్తుంది అనేది తెలుస్తుంది.