BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారంలో హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి వారు ప్రదర్శన చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయ్యే ప్రయత్నంలో ఎంపిక అయ్యేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారని మన గతంలోనే చెప్పుకున్నాము. గడిచిన రెండు వారాల పాటు ఎలాంటి ప్రదర్శన ఇవ్వని కంటెస్టెంట్స్ కూడా మూడో వారంలో బిగ్ బాస్ షోకి కంటెంట్ ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఎవరికి వారు కెప్టెన్ అవ్వడానికి ఆశపడుతున్నారు. ఈ వరుసలో ముఖ్యంగా రేవంత్, శ్రీహాన్, సూర్య,ఫైమా, ఆదిరెడ్డి, గీతూ ఉన్నారనే చెప్పవచ్చు. ఇందులో ఇప్పటికే శ్రీహాన్, ఫైమా, ఆదిరెడ్డి, గీతూతో పాటు శ్రీసత్య కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయ్యారు. వారికి బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. అందులో గీతూ, ఫైమా తప్పుకోగా ఇప్పుడు ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్ కెప్టెన్సీ పోటీదారుల బరిలో ఉన్నారు.

అంతకు ముందు కెప్టెన్సీ పోటీదారుడిగా ఉండాలని ఆశించిన అర్జున్ కళ్యాన్ తన చేతులారా అసలైన ఛాన్స్ మిస్ చేసుకున్నారు. టాస్క్ ఎలాగైనా గెలవాలని ఒకానొక సమయంలో బాత్ రూంలో బొమ్మలను బాత్ రూంలో ఉండి దాచుకున్న అర్జున్ అసలైన ఛాన్స్ మిస్ చేసుకున్నాడు, అది ఎలాగంటే.. అడవిలో ఆట టాస్క్ పూర్తి అవగానే బిగ్ బస్ అడవిలో ఉన్న బొమ్మలను లెక్కపెట్టాలని సభ్యులకు సూచిస్తారు. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న కొందరు బొమ్మలను లెక్క పెడతారు. ఇందులో ఉన్న బంగారు కొబ్బరి బోండం మందు అర్జున్ చేతిలోనే ఉంటుంది.
కానీ శ్రీసత్య తనకు తెలియకుండానే అర్జున్ దగ్గర నుండి బోండాన్ని తీసుకుని పెట్టుకుంటుంది. బిగ్ బాస్ ఎవరూ ఊహించని విధంగా బంగారు కొబ్బరి బోండం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేశాడు. అప్పుడు సత్య చేతిలో బంగారు కొబ్బిరి బోండం ఉంది. దీంతో సత్యకు కెప్టెన్సీ పోటీదారుడిగా ఉండేందుకు నేరుగా ఎంపిక అవుతోంది. ఈ విషయం తెలీక అర్జున్ కళ్యాన్ తన చేతులారా అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.