Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడు గా విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇక “RRR” విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. “RRR” లో రామరాజు పాత్ర బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. “జంజీర్” సినిమా విడుదలైన సమయంలో విమర్శించిన బాలీవుడ్ మీడియా “RRR” విడుదలయ్యాక చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడు చరణ్ మార్కెట్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో ఉండటంతో.. ఆ స్థాయిలోనే చరణ్ సినిమాలు ఒప్పుకుంటున్నాడు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న “RC15” కూడా పాన్ ఇండియా ప్రోజేక్టే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొన్నటి వరకు చాలా శరవేగంగా సాగింది. వైజాగ్, పంజాబ్, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కానీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికులు షూటింగ్లకు బంద్ చెప్పటంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఆగస్టు నెల చివరిలో మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ కావటం తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ శంకర్ తన సినిమా కాకుండా కమల్ హాసన్ సినిమా “ఇండియన్ 2” పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో.. రామ్ చరణ్ ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
వాస్తవానికి చరణ్ సినిమా స్టార్ట్ అయిన సమయంలో మరో సినిమా పై శంకర్ ఫోకస్ చేయకూడదని భావించారు. కానీ కమల్ నటించిన “విక్రమ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో.. “ఇండియన్ 2” పై దృష్టి పెట్టి కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి విడుదల చేయాలని.. డిసైడ్ అయ్యారట. దీంతో గత కొన్ని వారాల నుండి షూటింగ్ లేక ఖాళీగా ఉండటంతో చరణ్ డైరెక్టర్ శంకర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి