Chandrababu: సీఎం వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ రెడ్డీ.. నీ పైశాచిక ఆనందం తాత్కాలికమేనని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు నీ కథ చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరుగా మారుస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఎన్టీఆర్ చొరవతో, ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఎన్టీఆర్ మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకారణం చేసింది.
దశాబ్దాలుగా ఆ పేరు అలాగే కొనసాగుతూ వస్తుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యనివర్సిటీ మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరుు మార్చాల్సిన అవసరం ఏంటని, ఇది దుర్మార్గమని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో జగన్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకుని మళ్లీ ఎన్టీఆర్ పేరును పెట్టేవరకు టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీని ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుని ఉంటే కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. హార్టికల్చర్ కాలేజీకి రాజశేఖర్ రడ్డి పేరును తాము తొలగించామా అని చంద్రబాబు తెలిపారు. హెల్త్ వర్సిటీ పేరు మార్చినందువల్ల నీ నీచబుద్ది బయటపడిందే తప్ప.. నీ హుందూతానం పెరగేలేదు జగన్ రెడ్డీ అని చంద్రబాబు విమర్శించారు.
Chandrababu:
నీ చేతకాని దద్దమ్మ పనులకు తనను విమర్శించే హక్కు లేదని తెలిపారు. కావాలంటే జగన్ సొంతగా కాలేజీలు ఏర్పాటు చేసి వైఎస్ పేరు పెట్టుకోవాలని సూచించారు. కడప స్టీల్ ప్లాంట్ పెట్టుకుని మీ తండ్రి పేరు పెట్టుకో.. ఇరిగేషన్ ప్రాజకక్టు కట్టి పెట్టుకో. .అందుకు తనకేం అబ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారు.