ఆదిత్య, సత్యలను మీ ఇద్దరి మధ్య ఇంకెపుడు క్షమాపణలు చెప్పుకునే రోజు రాకూడదని హెచ్చరిస్తుంది దేవడమ్మ. అక్కడ దేవేమో సత్య అన్న మాటలను తలుచుకుని బాధపడతుంది. రాధ దేవిని ఓదార్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా దేవి తల్లి మాట వినదు. ఇదంతా గమనించిన మాధవ్ ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదని హ్యాపీగా ఫీలవుతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 21 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవుడమ్మ రాధకు ఫోన్ చేసి తమకు దేవి మీద ఉన్న ప్రేమ గురించి వివరిస్తుంది. అంతేకాకుండా దేవిని ఎలాగైనా మా ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నీదేనని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అపుడు రాధ ‘నీ ఇంటి బిడ్డని మీ ఇంటికి పంపించుడు ఏంది అత్తమ్మ. అది నీ రక్తం. నీ వారసురాలు’ అనుకుంటూ బాదపడుతుంది. మరోవైపు మాధవ్ దేవుని దగ్గరికి వెళ్లి ఇప్పటి వరకు తనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అంటాడు. చిన్మయిని అడ్డుపెట్టుకుని రాధను ఒప్పించాలనుకుంటాడు. రాధను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, తన సొంతం చేసుకోవాలని దేవుడి దగ్గర వేడుకుంటాడు. నిన్ను ఇప్పటికీ ఏం అడగలేదని, అడిగిన ఈ ఒక్కటి సక్సెస్ అవాలని, రాధ నాతో శ్రీశైలం వచ్చేలా చూడమని వేడుకుంటాడు. ఇక రాధ దగ్గరికి వెళ్లి చిన్మయి పుట్టిన వెంటనే జాతకంలో తనకు నాగదోషం ఉందని, పూజ నివారణ చేయాలని చెబుతాడు. ఈలోపే తనకు ఆక్సిడెంట్ అయి భార్య చనిపోవడం, చిన్మయి కోసం నువ్ రావడం జరిగిందని చెప్పి నమ్మిస్తాడు. నాకోసం కాకపోయినా చిన్మయి కోసమైనా శ్రీశైలం వెళ్లాలి. నేను ఆ ఏర్పాట్లు చేస్తానని చెప్పి వెళ్లిపోతాడు మాదవ్. దూరం నుంచి కొడుకు మాటలన్నీ వింటుంది జానకి. చిన్మయికి జాతకం చూపించింది నేనే కదా అని గతాన్ని గుర్తుచేసుకుంటుంది. మాధవ మీద అనుమానం కలుగుతుంది తల్లికి.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ సత్యను పిలిచి తన బాధను పంచుకుంటుంది. భర్తతో గడపాలనుకున్నప్పుడు ఎవరైనా వస్తే కోపం వస్తుంది కానీ మనవాళ్లని కూడా చూసుకోవాలని గుర్తుచేస్తుంది. చిన్నపిల్ల దేవికి నీ బాధ అర్థం కాదు కదమ్మా.. ఆదిత్య అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. ఇంకేదైన సమస్య ఉంటే మీరు మాట్లాడుకున్న తర్వాతే అందరి ముందుకురావాలి అని హితబోధ చేస్తుంది. ఈసారి మీరిద్దరూ బయటికి వెళ్లే ప్లాన్ నేను చేస్తానని హామీ ఇస్తుంది కోడలికి.
మరోవైపు రాధ బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటపుడు తన పాదాల తడి అడుగులు పడతాయి. మాధవ ఆ అడుగుల మీది నుంచి ఏడడుగులు వేస్తాడు. తాళి కట్టకుండానే ఏడడుగులు నడిచేశాను అని ఫీలవుతాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వస్తుంది జానకి. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది. అయినా ఏమాత్రం జంకకుండా తల్లి మాటను లెక్క చేయడు మాధవ్. ఏ దోషం లేకపోయినా రాధను శ్రీశైలం తీసుకువెళ్లడం వెనుక నీ ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తుంది జానకి.
ఆదిత్య రాధకు ఫోన్ చేస్తాడు కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. కానీ చివరగా ఒకసారి ఫోన్ ఎత్తుతుంది. నాతో మాట్లాడడం ఇష్టం లేదా రుక్మిణి? ఎందుకు ఫోన్ తీయడం లేదని అడుగుతాడు ఆదిత్య. ‘ఒకసారి నీతో మాట్లాడాలి. మనం కలవాలి రుక్మిణి. త్వరగా రా’ అని చెప్పి కట్ చేస్తాడు. ఆ తర్వాత జానకి ఒంటరిగా రాధ గురించి ఆలోచిస్తుంది. మాధవ్ ప్రవర్తన గురించి అర్థమై రాధ అలా ఉంటుందా? అందుకే ఎవరికీ ఏం చెప్పకుండా బాధపడుతుందా? అని తనలో తానే అనుకుంటుంది. అప్పుడే రామ్మూర్తి తనకు ఫోన్ చేసి ఏదో ఫైల్ మరిచిపోయానని మాధవతో పంపిచమని అడుగుతాడు. ఆ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు కానీ మీరు త్వరగా ఇంటికి రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది జానకి. రామ్మూర్తి జానకితో ఏం చెబుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..