Viral Video: మనలో చాలామందికి టైం పాస్ కోసం జంతువుల ఫన్నీ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. జంతువులు చేసే చేష్టలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలా ఉండదు. చాలా వరకు జంతువులను చూస్తే మనం భయపడతాం. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల మినహా ఏ జంతువును చూసినా మనకు భయం వేస్తుంది.
తాజాగా ఆకలిగా ఉన్న ఓ ఎలుగుబంటి చేసిన పని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకలిగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? దగ్గరలో తినడానికి ఏం ఉందా అని ఆలోచించి, చేతికి దొరికింది నోట్లో వేసుకుంటారు. అలా ఆకలిని తీర్చుకుంటారు. అచ్చం ఇలానే ఎలుగుబంటి చేసింది. ఆకలిని ఆపుకోలేక ఆ ఎలుగుబంటి చేసిన పని సిసి కెమెరాల్లో రికార్డ్ కాగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాలిఫోర్నియాలోని ఒలంపిక్ వ్యాలీలోని ఓ సూపర్ మార్కెట్లోకి ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి ఆకలిగా ఉండటంతో సూపర్ మార్కెట్లోని స్నాక్స్ ప్యాకెట్లను లాగేసింది. అయితే సూపర్ మార్కెట్లో బోలెడన్ని స్నాక్స్ ఉండటంతో ఎలుగుబంటి రాత్రంతా అక్కడే గడిపించింది. అక్కడే తిరుగుతూ రకరకాల స్నాక్స్ తినింది.
Viral Video:
సూపర్ మార్కెట్లోకి ఎలుగుబంటి వచ్చిన విషయాన్ని ఓ క్యాషియర్ గమనించాడు. ఎలుగుబంటి ఆకారం, సైజు చూసి హడలిపోయిన సదరు క్యాషియర్ ఎలాంటి అలికిడి లేకుండా కూర్చున్నాడు. క్యాషియర్ వెనకే మరో డోర్ ఉండటంతో అతడు కాస్త ధైర్యంగా ఉండిపోయాడట. కాగా ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రాత్రంతా స్నాక్స్ తిన్న ఎలుగుబంటిని మొదటిసారి చూశామంటూ కామెంట్ చేస్తున్నారు.
‘You’re a thief, man’ — This brown bear helped itself to some late night treats at a 7-Eleven in Olympic Valley, CA 🐻🍫 pic.twitter.com/hcSx1XiKXw
— NowThis (@nowthisnews) September 20, 2022